ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఒప్పో దేశంలోనే మొదటి 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఆ కంపెనీకి ఉన్న ఆర్ అండ్ డీ సెంటర్లో దీనిని ఏర్పాటు చేసింది. ప్రపంచ వ్యాప్త 5 జీ అభివృద్ధిని ఈ ల్యాబ్ వేగవంతం చేయనున్నట్లు ఒప్పో తెలిపింది.
హైదరాబాద్‌కు ఒప్పో 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్: కేటీఆర్
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా హైదరాబాద్‌కు మరో భారీ పెట్టుబడి వచ్చిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఒప్పో 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇది దేశంలోనే మొదటి 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్ అని చెప్పారు. మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో వివరాలు వెల్లడించారు. పెట్టుబడులకు హైదరాబాద్ సానుకూలమని మరోసారి నిరూపితమైందని కేటీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్‌కు ఒప్పో 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్: కేటీఆర్
మిడిల్ ఈస్ట్ ఆసియా, దక్షిణాసియా, ఆఫ్రికా, జపాన్, ఐరోపా దేశాలకు సంబంధించిన ఇన్నోవేషన్ కార్యక్రమాలు ఇక్కడ కొనసాగనున్నట్లు వెల్లడించింది. కెమెరా, బ్యాటరీ, పర్ఫామెన్స్‌లకు సంబంధించి మరో మూడు ప్రత్యేక ల్యాబ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.
ల్యాబ్ ఏర్పాటుపై ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ కూడా ప్రకటన చేశారు. పెట్టుబడులకు హైదరాబాద్ సానుకూలమని మరోసారి నిరూపితమైందని పేర్కొన్నారు.
Last Updated : Dec 22, 2020, 4:06 PM IST