KTR about palle pragathi : రాష్ట్రంలో అమలు చేస్తున్న పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామీణాభివృద్ధిలో కొత్త శకం ఆరంభమైందని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. దేశంలో బహిర్భూమి రహిత గ్రామాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏది..? అంటూ ట్విటర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు. 96.74 శాతం ఓడీఎఫ్ గ్రామాలతో తెలంగాణ ముందంజలో ఉందని చెప్పారు.
KTR about palle pragathi : పల్లెప్రగతితో గ్రామీణాభివృద్ధిలో కొత్త శకం: కేటీఆర్ - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్
KTR about palle pragathi : రాష్ట్రంలో పల్లెప్రగతితో గ్రామీణాభివృద్ధిలో కొత్త శకం ఆరంభమైందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో బహిర్భూమి రహిత గ్రామాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు అందనంత దూరంలో నిలిచిందన్నారు.
![KTR about palle pragathi : పల్లెప్రగతితో గ్రామీణాభివృద్ధిలో కొత్త శకం: కేటీఆర్ KTR about palle pragathi, ktr about telangana development](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14080294-863-14080294-1641192334744.jpg)
పల్లెప్రగతి గురించి మంత్రి కేటీఆర్ ట్వీట్
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు అందనంత దూరంలో నిలిచిందన్నారు. తెలంగాణ తర్వాత 35.59శాతంతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచిందన్న కేటీఆర్.. పల్లెల అభివృద్ధికి పాటుపడుతున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, అధికారులు, సిబ్బందిని అభినందించారు.
ఇదీ చదవండి: Case registered against MP Arvind: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై కేసు నమోదు.. ఏమైందంటే?