ప్రజల సౌకర్యార్థం వచ్చే పంద్రాగస్టు నాటికి మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో అదనంగా 4,696 పబ్లిక్ టాయ్లెట్స్ నిర్మాణాలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లను మంత్రి కేటీఆర్ ఆదేశించారు.
జీహెచ్ఎంసీ మినహా 139 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో జనాభా ఆధారంగా 7,685 పబ్లిక్ టాయ్లెట్ల ఆవశ్యకత ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇప్పటి వరకు 2,989 పబ్లిక్ టాయ్లెట్లు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. వీటికి అదనంగా 4,696 పబ్లిక్ టాయ్ లెట్స్ నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.