హైదరాబాద్ రోడ్ల అభివృద్ది సంస్థ జీహెచ్ఎంసీతో కలిసి అన్ని ప్రాంతాలను కలుపుతూ రహదారుల నిర్మిచటమే కాకుండా ముఖ్య మైన ప్రాంతాల్లో లింక్ రోడ్లను అందుబాటులోకి తెస్తోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం 126.20 కిలోమీటర్ల మేర 135 లింకు రోడ్లు నిర్మాణ దశలో ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
హైదరాబాద్లో అందుబాటులోకి 135 లింకు రోడ్లు: కేటీఆర్ - హైదరాబాద్ లింకు రోడ్ల తాజా వార్తలు
జీహెచ్ఎంసీ హైదరాబాద్లోని ముఖ్యమైన ప్రాంతాల్లో లింక్ రోడ్లను అందుబాటులోకి తెస్తోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం 126.20 కిలోమీటర్ల మేర 135 లింకు రోడ్లు నిర్మాణ దశలో ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే భాగ్యనగరంలో రవాణా వ్యవస్థ వేగంగా జరిగేందుకు చర్యలు చేపట్టామని.. అందులో భాగంగానే నూతన ఆవిష్కరణలు తెచ్చామన్నారు.
![హైదరాబాద్లో అందుబాటులోకి 135 లింకు రోడ్లు: కేటీఆర్ హైదరాబాద్లో అందుబాటులోకి 135 లింకు రోడ్లు: కేటీఆర్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9517674-thumbnail-3x2-ktr.jpg)
హైదరాబాద్లో అందుబాటులోకి 135 లింకు రోడ్లు: కేటీఆర్
ఇప్పటికే భాగ్యనగరంలో రవాణా వ్యవస్థ వేగంగా జరిగేందుకు చర్యలు చేపట్టామని.. అందులో భాగంగానే నూతన ఆవిష్కరణలు తెచ్చామన్నారు. నగరంలో జీహెచ్ఎంసీ.. హెచ్ఆర్‌డీసీఎల్, సీఆర్ఎంపీ, నెట్‌వర్క్ వైడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ వంటి ప్రాజెక్టుల ద్వారా పలు పై వంతెనలు, రహదారులు నిర్మించిందని కేటీఆర్ వెల్లడించారు.
ఇదీ చదవండి:నేడు కంప్యాక్టర్ వాహనాలను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్