తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్ల విషయంలో భాజపా నేతలు స్పందించాలి : కేటీఆర్​

రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్​లో రోడ్ల విస్తరణకు నాలుగు రకాల ప్రణాళికలు రూపొందించామని మంత్రి కేటీఆర్​ అన్నారు. నూతన, లింక్​ రోడ్లను దశల వారీగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్​లో పలు చోట్ల రోడ్లను ఇవ్వాలని కేంద్రంను కోరినా ఇవ్వడం లేదని పేర్కొన్నారు. భాజపా నేతలు స్పందించాలని తెలిపారు. రాష్ట్ర శాసన మండలిలో పలువురు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం చెప్పారు.

minister ktr said BJP leaders must respond to hyderabad roads
రోడ్ల విషయంలో భాజపా నేతలు స్పందించాలి : కేటీఆర్​

By

Published : Sep 14, 2020, 12:14 PM IST

రోడ్ల విషయంలో భాజపా నేతలు స్పందించాలి : కేటీఆర్​

"రాష్ట్రంలో గత ఆరేళ్లలో హైదరాబాద్​లో రోడ్ల విస్తరణకు నాలుగు రకాల ప్రణాళికలు తీసుకున్నాం. సీఎం కేసీఆర్​ సూచన మేరకు మొదటగా ఎస్​ఆర్​డీపీని అమలు చేశాం. రూ.29,600 కోట్లతో లీ అసోసెయోట్ ఆధ్వర్యంలో పనులను అప్పగించాం. దాంట్లో ఆరు వేల కోట్ల పనులు ప్రారంభించాం. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి.

రెండోది హైదరాబాద్​లో 709 కి.మీ.ల రోడ్ల మెయింటనెన్స్​కు రూ.1800 కోట్ల రూపాయలతో ప్రైవేటు సంస్థలకు అప్పగించడం జరిగింది. 1,037 మిస్సింగ్​ రోడ్లను కూడా దశల వారీగా పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం.

మేము కొత్త రోడ్లు వేయడానికి ప్రణాళికలు వేస్తుంటే కేంద్రం రోడ్లను మూసేస్తుంది. హైదరాబాద్​లో పలు చోట్ల రోడ్లను ఇవ్వాలని కేంద్రంను కోరినా స్పందన లేదు. రాష్ట్రంలో కంటోన్​మెంట్​ రోడ్ల విషయంలో ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​కు​ అనేక లేఖలు రాశాం. కేంద్ర నుంచి ఉలుకు పలుకు లేదు. భాజపా ఎమ్మెల్సీ రామచంద్రరావు, పలువురు నేతలు కూడా రాష్ట్రానికి రావాల్సిన రహదారుల విషయంలో స్పందించి కేంద్రానికి చెప్పాలి."

- పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​

ఇదీ చూడండి :కొండపోచమ్మ జలాశయం కట్టకు బుంగ

ABOUT THE AUTHOR

...view details