తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR: హైదరాబాద్‌లో త్వరలో ఎయిరో స్పేస్ డిఫెన్స్ యూనివర్శిటీ - hyderabad news

రక్షణ, ఎయిరో స్పేస్ రంగాలు మరింత విస్తరించేలా.. త్వరలో ఒక ఎయిరో స్పేస్, డిఫెన్స్ యూనివర్శిటీ, డిఫెన్స్ ఎయిరో స్పేస్ ఇంక్యుబేటర్, డ్రోన్ టెస్టింగ్ కారిడార్​లను నెలకొల్పేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయాత్నాలు చేస్తోందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎయిర్​ క్రాఫ్ట్​ల విడిభాగాల తయారీ హైదరాబాద్​ నుంచి జరగటం రాష్ట్రానికి గర్వకారణమన్నారు.

ktr
మంత్రి కేటీఆర్

By

Published : Sep 16, 2021, 6:56 AM IST

రక్షణ, ఏరో స్పేస్ రంగాలకు... హైదరాబాద్ హబ్‌గా ఎదుగుతోందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఈ రంగాలు మరింత విస్తరించేలా... త్వరలో ఒక ఎయిరో స్పేస్ డిఫెన్స్ యూనివర్శిటీ.... డిఫెన్స్ ఎయిరో స్పేస్ ఇంక్యుబేటర్, డ్రోన్ టెస్టింగ్ కారిడార్లను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ ఆదిభట్లలోని టాటా లాక్‌హీడ్ మార్టిన్ ఏరోస్ట్రక్చర్స్- టీఎల్​ఎమ్​ఎఎల్​(TLMAL) ప్లాంట్‌లో 150వ సీ-130జే విమాన బాడీ ఉత్పత్తి పూర్తైన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఎయిర్ క్రాఫ్ట్‌ల విడిభాగాల తయారీ హైదరాబాద్ నుంచి జరగటం రాష్ట్రానికి గర్వకారణమని కేటీఆర్‌ చెప్పారు.

హైదరాబాద్‌లో ఎయిరో స్పేస్ డిఫెన్స్ యూనివర్శిటీ ఏర్పాటుకు మేం ప్రయత్నిస్తున్నాం. ఆవిష్కరణలను వెలికితీసేందుకు ప్రభుత్వం ఎప్పుడూ కృషి చేస్తుంది. ఏరోస్పేస్‌ రంగంలో ఆవిష్కరణల కోసం డిఫెన్స్‌ ఏరోస్పేస్‌ ఇంక్యుబేటర్‌ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. ఈ రంగంలోని సంస్థలకు మరింత సహాయం కోసం అంకుర సంస్థలు, మరిన్ని ఆలోచనలను ప్రోత్సహిస్తున్నాం. డ్రోన్ల ద్వారా మారుమూల ప్రాంతానికి వ్యాక్సిన్లు, మందులు సరఫరా చేసిన మెుదటి రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రంలో డ్రోన్‌ టెస్టింగ్‌ కారిడార్‌ను త్వరలోనే నెలకొల్పుతాం.

ఇదీ చూడండి:NEW IT POLICY: నేడు కొత్త ఐటీ విధానాన్ని ఆవిష్కరించనున్న మంత్రి కేటీఆర్‌

ABOUT THE AUTHOR

...view details