హైదరాబాద్‌కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సరూర్‌నగర్ పరిధి ఎన్టీఆర్ నగర్‌లో కేటీఆర్ రోడ్‌షో నిర్వహించారు. ప్రపంచ ప్రఖ్యాత ఐటీ సంస్థలు హైదరాబాద్‌కు వస్తున్నాయన్న ఆయన... కేసీఆర్ సమర్ధ నాయకత్వం కారణంగానే ఐటీ అభివృద్ధి చెందిందని ఉద్ఘాంటించారు.
ఏ సమస్య వచ్చినా జనంలోకి వెళ్లింది తెరాస నాయకులే. గల్లీ పార్టీ కావాలా? దిల్లీ పార్టీ కావాలా? హైదరాబాద్ గులాబీలు కావాలా? గుజరాతీ గులాములు కావాలా? తెలంగాణ నుంచి కేంద్రానికి రూపాయి వెళ్తే... ఆఠాణా మాత్రమే వెనక్కి వస్తోంది.
--- రోడ్‌షోలో కేటీఆర్
ఆరేళ్లలో తెలంగాణ నుంచి రూ.2.70లక్షల కోట్ల పన్నులు కేంద్రానికి వెళ్లగా... కేంద్రం నుంచి మాత్రం రూ.1.4 లక్షలు మాత్రమే వచ్చాయని ఆరోపించారు. రూ.10 వేల సాయం ఆపినోళ్లు... రూ.25 వేలు ఇస్తారా? అని ఎద్దేవా చేశారు. వరద సాయం కోసం కేంద్రానికి లేఖ రాసి 8 వారాలైనా... ఇంతవరకు కేంద్రం నుంచి ఉలుకూపలుకూ లేదని విమర్శించారు.