తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్లానింగ్, విజనింగ్, డిజైనింగ్​పై దృష్టి పెట్టండి: కేటీఆర్ - tsbpass latest news

టీఎస్​బీపాస్ చట్టం వచ్చిన తర్వాత హెచ్‌ఎండీఏలో జరుగబోయే మార్పులకు సంబంధించి ఇప్పటి నుంచి సంసిద్ధంగా ఉండాలని అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ పరిధిలో ఉన్న బఫర్ జోన్‌లో వచ్చిన నిర్మాణాల పట్ల కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. హెచ్‌ఎండీఏలో జరుగుతున్న మౌలిక వసతుల కార్యక్రమాలపై కేటీఆర్ సమీక్షించారు.

ktr
ktr

By

Published : Sep 12, 2020, 4:21 PM IST

హెచ్‌ఎండీఏ మౌలిక వసతుల కార్యక్రమాలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. టీఎస్​బీపాస్ చట్టం వచ్చిన తర్వాత హెచ్‌ఎండీఏలో జరుగబోయే మార్పులకు సంబంధించి ఇప్పటి నుంచి సంసిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. రానున్న కాలంలో ప్లానింగ్, విజనింగ్, డిజైనింగ్ వంటి అంశాలపై హెచ్‌ఎండీఏ మరింత దృష్టి సారించాలని సూచించారు. హెచ్‌ఎండీఏలో జరుగుతున్న మౌలిక వసతుల కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ సమీక్షించారు.

హైదరాబాద్ గ్రోత్ కారిడార్ పరిధిలో ఉన్న బఫర్ జోన్‌లో వచ్చిన నిర్మాణాల పట్ల కఠినంగా వ్యవహారించాలని మంత్రి పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ తరహాలో అసెట్‌ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ విషయంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. అవుటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి వే సైడ్ అమెనిటిస్‌ ఉండేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.

ఇదీ చదవండి:సమ్మె విరమించిన ఉస్మానియా ఆసుపత్రి జూడాలు

ABOUT THE AUTHOR

...view details