KTR review On EODB ranks: సరళతర వాణిజ్య విధానం ర్యాంకుల్లో అగ్రస్థానమే లక్ష్యంగా అందరూ సమష్టిగా కృషి చేద్దామని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈఓడీబీ ర్యాంకుల ప్రక్రియపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సంబంధిత కార్యదర్శులు, శాఖాధిపతులతో హైదరాబాద్లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. వివిధ శాఖలకు సంబంధించిన సంస్కరణలు, సన్నాహక ప్రక్రియపై అధికారులకు సూచించారు.
KTR review On EODB ranks: రాష్ట్ర ప్రభుత్వ విధానాల వల్లే పెట్టుబడులు: కేటీఆర్
KTR review On EODB ranks:సులభతర వాణిజ్యంలో తెలంగాణ మొదటిస్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ర్యాంకుల్లో అగ్రస్థానమే లక్ష్యంగా వివిధ శాఖలకు సంబంధించిన సంస్కరణలు, సన్నాహక ప్రక్రియపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈఓడీబీ ర్యాంకుల ప్రక్రియపై హైదరాబాద్లోని మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో మంత్రి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.
EODB ranks for telangana: ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనం, శాఖాధిపతుల కృషితో గతంలో అగ్రస్థానంలో నిలిచామన్న కేటీఆర్... ఈసారి కూడా అదే లక్ష్యంతో పని చేద్దామన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన వివిధ అంశాల్లో సంస్కరణలు, చర్యలు వందశాతం పూర్తయ్యాయని పరిశ్రమల శాఖ అధికారులు మంత్రికి వివరించారు. వివిధ శాఖలకు సంబంధించిన 300కు పైగా సంస్కరణలు, చర్యలు పూర్తైనట్లు తెలిపారు. ర్యాంకులను నిర్దేశించడంతో యూజర్ ఫీడ్ బ్యాక్ అత్యంత కీలకమైన అంశమని పేర్కొన్నారు. వివిధ శాఖల నుంచి పొందుతున్న సేవలపై పరిశ్రమ వర్గాల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటారని అధికారులు తెలిపారు.
ktr on easy of doing business: రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, అధికారుల చొరవతో రాష్ట్రానికి పలు కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తున్నాయని మంత్రి కేటీఆర్ వివరించారు. దీంతో తెలంగాణలో అద్భుతమైన ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. సరళతర వాణిజ్య విధానం ర్యాంకుల కోసం పనిచేయడం కేవలం పరిశ్రమల శాఖ కోసం పనిచేయడం మాత్రమే కాదని... ఆయా విభాగాలను బలోపేతం చేసుకునేందుకు ఒక అద్భుత అవకాశమని మంత్రి తెలిపారు. తమ తమ విభాగాలను బలోపేతం చేసుకుంటూనే ప్రజల కోసం పనిచేస్తున్నామన్న స్ఫూర్తితో పనిచేస్తే ర్యాంకుల్లో మరోసారి అగ్రస్థానం కైవసం చేసుకోవడం ఖాయమని కేటీఆర్ అన్నారు. ఈఓడీబీ ర్యాంకులకు సంబంధించి ఆయా శాఖల సమీక్ష నిర్వహించిన మంత్రి అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు.