జీహెచ్ఎంసీ పరిధిలోని రెవెన్యూ సమస్యలపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాప్రతినిధులు, కాలనీ సంఘాల ప్రతినిధులు సమీక్షలో పాల్గొన్నారు. హైదరాబాద్ గత ఆరేళ్లల్లో దేశంలోని లక్షలాది మందికి గమ్యస్థానంగా మారిందని కేటీఆర్ అన్నారు. పెట్టుబడులు, పరిపాలనా సంస్కరణలు, రాజకీయ స్థిరత్వమే అభివృద్ధికి కారణమని చెప్పారు.
లక్షలాది మందికి గమ్యస్థానంగా హైదరాబాద్: కేటీఆర్ - హైదరాబాద్ వార్తలు
11:37 September 26
లక్షలాది మందికి గమ్యస్థానంగా హైదరాబాద్: కేటీఆర్
కొత్త రెవెన్యూ చట్టంతో ఎవరికీ ఇబ్బంది లేకుండా చేస్తామని.. సాగు భూములపై హక్కులు కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. సామాన్యుడిపై భారం పడకుండా కొత్త చట్టం తీసుకువస్తున్నామని తెలిపారు. భవిష్యత్‌లో అన్ని రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్ ఆధారంగానే జరుగుతాయని వెల్లడించారు. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులకు వేర్వేరు రంగుల్లో పాసుపుస్తకాలు ఇస్తామన్నారు.
హైదరాబాద్‌లో సుమారు 24.50 లక్షల ఆస్తులు ఉన్నట్లు అంచనా వేశామన్నారు. ప్రజలు నిశ్చింతగా వారి ఆస్తిపై హక్కులను పొందేలా ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఆస్తుల క్రయవిక్రయాల్లో ఇబ్బందులు లేకుండా చూస్తామని తెలిపారు. ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలని కోరారు. ఆస్తుల నమోదు కార్యక్రమంలో దళారులను నమ్మొద్దని, ఒక్కపైసా ఇవ్వవద్దని ప్రజలకు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:పరువు హత్య: సినీ ఫక్కీలో అల్లుని హత్య... మామతో సహా 14 మంది కటకటాల్లోకి...