జేబీఎస్ - ఎంజీబీఎస్ కారిడార్ ప్రారంభంతో హైదరాబాద్ మెట్రో రైల్ దేశంలో రెండో అతిపెద్ద మెట్రో నెట్ వర్క్‌గా అవతరిస్తుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 7న ప్రారంభించనున్న మూడో కారిడార్ ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్, మెట్రో రైల్, పోలీస్ అధికారులతో ప్రగతి భవన్లో కేటీఆర్ సమీక్షించారు.
పగడ్బందీ ఏర్పాట్లు
ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్న మంత్రి... ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కారిడార్ పరిధిలోని ప్రజాప్రతినిధులతో పాటు, నగర ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కార్యక్రమం సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మెట్రో అధికారులను కేటీఆర్ ఆదేశించారు.