హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలో జీహెచ్‌ఎంసీ చేపట్టిన పనులను వేగంగా పూర్తి చేయాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎస్‌ఆర్‌డీపీ కింద మంజూరు చేసిన ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు తదితర పనులపై మంత్రి సమీక్షించారు. రోడ్ల విస్తరణ పనులు, మెట్రో లైన్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, మంచినీటి సరఫరా పైప్‌లైన్ల నిర్వహణ, క్రీడా మైదానాల నిర్మాణం, నాలాల వెడల్పు తదితర మౌలిక వసతుల పనుల ప్రగతిని మంత్రి తెలుసుకున్నారు.
నాలాల విస్తరణకు రూ. 200 కోట్లు..
ఈ పార్లమెంట్ పరిధిలోని అన్ని వీడీసీసీ రోడ్లను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు. తాగునీటి సరఫరాలో పైప్‌లైన్ల లీకేజీల వల‌్ల ప్రజలకు కలుగుతున్న ఇబ్బందులను తొలగించి దెబ్బతిన్న పైప్‌లైన్ల స్థానంలో కొత్త పైప్‌లైన్లు వేయాలని సూచించారు. నాలాల విస్తరణకు రూ. 200 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. మౌలిక వసతుల విస్తరణలో భాగంగా 20 రోడ్ల వెడల్పు, ప్రతిపాదిత మెట్రో రైలు మార్గంలో పనులు చేపట్టేందుకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ప్రత్యేక అధికారిని నియమించాలని జీహెచ్‌ఎంసీ కమీషనర్‌కు సూచించారు.
మూసీకి ఇరువైపులా.. నాలుగు లేన్లు