తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​ను పారిశుద్ధ్య నగరంగా మార్చేందుకు ప్రణాళికలు...

హైదరాబాద్​లో శానిటేషన్​ను మరింత మెరుగుపర్చాలని అధికారులను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రి​... ప్రతి వార్డుకు, సర్కిల్​కు శానిటేషన్ ప్రణాళికను తయారు చేయాలని సూచించారు. నగరంలో మరిన్ని చెత్త తరలింపు కేంద్రాలు, డంపింగ్ యార్డుల ఏర్పాటుకు స్థలాలను సేకరించాలని పేర్కొన్నారు.

MINISTER KTR REVIEW ON HYDERABAD SANITATION

By

Published : Oct 6, 2019, 6:06 AM IST

Updated : Oct 6, 2019, 7:53 AM IST

పారిశుద్ధ్య నగరంగా మార్చేందుకు ప్రణాళికలు....
గ్రేటర్ హైదరాబాద్​లో శానిటేషన్ నిర్వహణ, రవాణా, భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణ ప్లాంట్ సహా పలు అంశాలపై ఆయా జిల్లాల కలెక్టర్​లతో మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలకు హైదరాబాద్​లో 18 వేల మంది సిబ్బంది కృషి చేస్తున్నప్పటికీ.... నిర్వహణ మరింత మెరుగు పర్చాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. నగరవాసుల భాగస్వామ్యం పెంచాల్సి ఉంటుందని సూచించారు. వ్యర్థాలను తరలించే ప్రస్తుత వాహనాల స్థానంలో ఆధునిక యంత్రాలను ప్రవేశపెట్టేందుకు తగు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

గ్రేటర్​లో హెల్త్ క్యాలెండర్​ను రూపొందించాలని మంత్రి పేర్కొన్నారు. జీడిమెట్లలో ఏర్పాటు చేసిన భవన నిర్మాణ వ్యర్థాల రీసైక్లింగ్ ప్లాంట్​ను దీపావళి సందర్భంగా ప్రారంభించనున్నట్టు కేటీఆర్ తెలిపారు. ఫతుల్లాగూడలో ఏర్పాటు చేయనున్న సీ అండ్ డీ ప్లాంట్ కేంద్రానికి రహదారి ఏర్పాటు సమస్యను వెంటనే పరిష్కరించాలని కమిషనర్​ను ఆదేశించారు. నగరంలో రూ.160 కోట్ల వ్యయంతో చేపట్టిన జవహర్​నగర్ క్యాపింగ్ పనులు దాదాపుగా పూర్తి అవుతున్నాయని తెలిపారు.

సమీక్షా సమావేశంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, మున్సిపల్ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్​కుమార్ పాల్గొన్నారు.

ఇవీ చూడండి: కొనసాగుతున్న సమ్మె... ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ

Last Updated : Oct 6, 2019, 7:53 AM IST

ABOUT THE AUTHOR

...view details