హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. రెవెన్యూ, దేవాదాయ భూములపైన ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల రక్షణ చర్యలపై ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో చర్చ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి సమీక్షించారు.
ప్రభుత్వ స్థలాలకు జియో పెన్సింగ్, జీఐఎస్ మ్యాపింగ్ చేయాలి. ప్రభుత్వ భూములపైన ఉన్న వివాదాలను పరిష్కరించేందుకు కోర్టుల్లో బలమైన వాదనలు వినిపించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. అర్హులైన పేదలకు జీవో నంబర్ 58, 59 ద్వారా భూముల క్రమబద్ధీకరించి వారికి భూ హక్కులు కల్పించాం. మరోసారి ఇలాంటి అవకాశాన్ని కల్పించే అంశంపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.