తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రస్తుతం 80 కాలనీల్లో నీరు ఉంది: కేటీఆర్

మరో మూడ్రోజుల పాటు వర్షాలు ఉన్నాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. వర్షం పడే అవకాశం ఉన్నచోట ప్రజలను అప్రమత్తం చేస్తున్నామని పేర్కొన్నారు. ఆ ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని స్పష్టం చేశారు. పునరావాస కేంద్రాల్లోని బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.

ktr
ktr

By

Published : Oct 19, 2020, 2:26 PM IST

Updated : Oct 19, 2020, 3:17 PM IST

సాధారణ వర్షపాతం కంటే అధికంగా వర్షాలు పడుతున్నాయని మంత్రి కేటీఆర్ తెలిపారు. క్యుములోనింబస్ మేఘాలతో వానలు పడుతున్నట్లు వాతావరణ కేంద్ర అధికారులు చెబుతున్నారని చెప్పారు. వేలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు పేర్కొన్నారు. ప్రాణనష్టాన్ని చాలావరకు తగ్గించగలిగామని వివరించారు. వరద సహాయక చర్యలపై జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ రామ్మోహన్, ఉన్నతాధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్షించారు.

రాబోయే మూడ్రోజుల పాటు వర్షాలు ఉన్నాయని కేటీఆర్ వెల్లడించారు. వర్షం పడే అవకాశం ఉన్నచోట ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. ఆ ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని... వరద పరిస్థితిని సమీక్షించేందుకు 80 మంది ప్రత్యేక అధికారులను నియమించినట్లు చెప్పారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను కూల్చివేస్తామని స్పష్టం చేశారు. పునరావాస కేంద్రాల్లోని బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.

ప్రస్తుతం 80 కాలనీల్లో నీరు ఉంది. 37వేల రేషన్‌ కిట్లు పంపిణీ చేస్తున్నాం. ఒక్కో కిట్‌లో నెలకు సరిపడా నిత్యావసర సరకులు, దుప్పట్లు అందిస్తున్నాం. పునరావాస కార్యక్రమాలు ముమ్మరం చేశాం. ఆరోగ్య సమస్యల నియంత్రణకు చర్యలు చేపట్టాం. విద్యుత్‌ పునరుద్ధరణ కోసం చర్యలు తీసుకున్నాం. 164 ట్రాన్స్‌ఫార్మర్లకు మరమ్మతులు చేయాల్సి ఉంది.

- కేటీఆర్, మంత్రి

ప్రస్తుతం 80 కాలనీల్లో నీరు ఉంది: కేటీఆర్

తక్షణ సాయం కింద రూ.1,350 కోట్లు ఇవ్వాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి కోరారని కేటీఆర్ తెలిపారు. ఇప్పటివరకు కేంద్రం నుంచి స్పందన రాలేదు.. వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న కాలనీల్లోని ప్రజలను కచ్చితంగా ఆదుకుంటామని ఉద్ఘాటించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 33 మంది మరణించారని... రాష్ట్రంలో మొత్తంగా 70 మంది మరణించారని పేర్కొన్నారు. ఇప్పటివరకు 29 మందికి రూ.5 లక్షల చొప్పున సాయం అందించామని వివరించారు. గల్లంతు అయిన మరో ముగ్గురిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని... వరద బాధితులు, మరణాలపై ప్రభుత్వం వద్ద పూర్తి సమాచారం ఉందని చెప్పారు.

ఆర్మీకి కూడా సమాచారమిచ్చాం..

వరద సహాయక చర్యల కోసం ప్రస్తుతం 18 బోట్లు ఉన్నాయని.. ఏపీ, కర్ణాటక నుంచి 30 బోట్లు వస్తాయన్నారు. ఆర్మీకి కూడా సమాచారం అందించినట్లు కేటీఆర్ వెల్లడించారు. హెలికాప్టర్లు కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్ మునిగినందున మొదటి అంతస్తులో ఉండటం మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ నిర్మాణం కూడా కూలీపోయే అవకాశం ఉంది కాబట్టి.. వెంటనే ఖాళీ చేయాలని కేటీఆర్​ సూచించారు.

ఇదీ చదవండి :జలదిగ్బంధంలోనే హైదరాబాద్‌ శివార్లలోని కాలనీలు

Last Updated : Oct 19, 2020, 3:17 PM IST

ABOUT THE AUTHOR

...view details