తెలంగాణ

telangana

హైదరాబాద్‌ వరద సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష

By

Published : Oct 20, 2020, 11:32 AM IST

Updated : Oct 20, 2020, 11:56 AM IST

ktr
ktr

11:28 October 20

హైదరాబాద్‌ వరద సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష

వరద సహాయక చర్యలపై మంత్రి కేటీఆర్ సమీక్షించారు. గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, మేయర్ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. కేసీఆర్ పిలుపు మేరకు 2 నెలల వేతనాన్ని సీఎం సహాయ నిధికి ఇచ్చేందుకు నిర్ణయించారు. విరాళం ఇవ్వాలని గ్రేటర్‌ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు నిర్ణయం తీసుకున్నారు.  ఎమ్మెల్యేలు వరద ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించాలని మంత్రి కేటీఆర్ సూచించారు.  

వరదతో నష్టపోయిన ప్రతిఒక్కరికీ సీఎం ప్రకటించిన సాయం అందించాలని మంత్రి తెలిపారు. జీహెచ్‌ఎంసీ శిబిరాలను సందర్శించి సౌకర్యాలను పర్యవేక్షించాలన్నారు. బాధితులకు భరోసా ఇచ్చేలా ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఉండాలని సూచించారు. ప్రస్తుతం వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రీస్టోరేషన్ పనులను పర్యవేక్షించాలని తెలిపారు. ప్రస్తుతం జీహెచ్​ఎంసీ చేపట్టిన కార్యక్రమాలను ప్రత్యేకంగా పర్యవేక్షించాలని నేతలకు కేటీఆర్​ సూచించారు. 

ఇదీ చదవండి :తమిళనాడు సీఎం పళనిస్వామికి కేసీఆర్ ఫోన్

Last Updated : Oct 20, 2020, 11:56 AM IST

ABOUT THE AUTHOR

...view details