తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR Review: 'భారీ వర్షాలు కురిసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి'

KTR Review: హైదరాబాద్ అభివృద్ధి కార్యక్రమాలపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన వరద నివారణ చర్యలపై ప్రధానంగా చర్చించారు.

KTR
KTR

By

Published : May 7, 2022, 5:09 AM IST

KTR Review: వర్షాకాల ప్రణాళికను త్వరగా పూర్తిచేయాలని.. ఒకవేళ భారీ వర్షాలు కురిసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన వరద నివారణ చర్యలపై ప్రధానంగా చర్చించారు. వరద నివారణ కోసం జీహెచ్ఎంసీ, జలమండలి కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని... సమన్వయం చేసుకోవాలని సూచించారు.

ప్రస్తుతం జలమండలి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎస్టీపీల నిర్మాణ పురోగతిని కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇతర విభాగాలు చేపట్టిన కార్యక్రమాలను సమీక్షించారు. మూసీ రివర్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌లోని లింకు రోడ్ల నిర్మాణం, నాలా అభివృద్ధికి సంబంధించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఔటర్ రింగ్ రోడ్‌పై పచ్చదనం కోసం అవసరమైన 108 కిలోమీటర్ల మేర తొమ్మిది లైన్లతో డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థను మంత్రి ప్రారంభించారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details