తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజారవాణా వ్యవస్థ బలోపేతానికి మెట్రో కారిడార్ దోహదం: కేటీఆర్‌

KTR Review on Second Phase Metro Rail Expansion: హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణకు డిసెంబర్ 9న సీఎం శంకుస్థాపన చేయనుండగా... ఆ కార్యక్రమ సన్నాహక సమావేశాన్ని మంత్రి కేటీఆర్ నిర్వహించారు. మంత్రులు తలసాని, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి సహా మెట్రో అధికారులు హాజరయ్యారు. శంకుస్థాపన ప్రాంతంలో 2 రోజుల్లో ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు కేటీఆర్ సూచించారు.

By

Published : Nov 30, 2022, 7:56 PM IST

KTR
KTR

KTR Review on Second Phase Metro Rail Expansion: హైదరాబాద్‌ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఎయిర్‌పోర్టు మెట్రో కారిడార్‌ ఉపయోగపడుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. శంషాబాద్‌ నుంచి మొదలుకొని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్‌ మధ్య ప్రయాణం చేసే లక్షలాది మందికి మెట్రో రైలు విస్తరణ ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. మెట్రో రైల్‌ రెండో దశ విస్తరణకు డిసెంబరు 9న సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌.. ఆ కార్యక్రమం సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మెట్రో రైల్‌, పురపాలక, ఎయిర్‌పోర్టు అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇంతటి కీలకమైన కార్యక్రమం శంకుస్థాపనను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్‌ అధికారులను ఆదేశించారు.

క్షేత్రస్థాయిలో మంత్రులు స్థల పరిశీలన చేయాలి : డిసెంబరు 9న శంకుస్థాపన చేసే ప్రాంతంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొనే సమావేశ ప్రాంగణం వంటి వాటి ఏర్పాట్లను రెండ్రోజుల్లో పూర్తి చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్‌ అధికారులకు సూచించారు. ఇందుకు సంబంధించిన స్థలాల పరిశీలనకు మంత్రులు, ప్రజాప్రతినిధులు గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిశీలన చేయాలని సూచించారు. హైదరాబాద్‌ నగరానికి అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు ఏదో ఒక నియోజకవర్గానికి సంబంధించిన కార్యక్రమం కాదని, ఇది మొత్తం నగర ప్రజల జీవితాల్లో భాగం కానున్న ప్రాజెక్టు అన్నారు. నగర వ్యాప్తంగా ఉన్న అందరు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమం నిర్వహణలో భాగస్వాములైతే బాగుంటుందని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం అవసరమైన నగర ప్రజా ప్రతినిధుల సమావేశాన్ని ఒకటి రెండురోజుల్లో ఏర్పాటు చేయాలని మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డిలకు మంత్రి కేటీఆర్‌ సూచించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details