తెలంగాణ

telangana

By

Published : May 2, 2020, 5:31 PM IST

ETV Bharat / state

ట్రాఫిక్​ రహిత హైదరాబాదే లక్ష్యం: కేటీఆర్​

హైదరాబాద్​ను ట్రాఫిక్​ రహిత నగరంగా మార్చటమే ప్రభుత్వ సంకల్పమని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. నగరంలో ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు అధికారులు మరింత వేగంగా ముందుకు సాగాలని సూచించారు. బుద్ధభవన్​లో సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

minister ktr review meeting with officials
ట్రాఫిక్​ రహిత హైదరాబాదే లక్ష్యం: కేటీఆర్​

హైదరాబాద్‌ నగరంలో ప్రస్తుతం జరుగుతోన్న రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు అధికారులు మరింత వేగంగా ముందుకు సాగాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ అధికారులకు సూచించారు. బుద్ధభవన్​లో మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్​కుమార్, కమిషనర్ డీఎస్ లోకేశ్​కుమార్​లతో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ రోడ్​ డెవలప్​మెంట్ కార్పొరేషన్ కింద చేపట్టిన పనుల ప్రగతిని మంత్రి సమీక్షించారు.

వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్​ను ట్రాఫిక్​ రహిత నగరంగా తీర్చిదిద్దటమే ప్రభుత్వ సంకల్పమని కేటీఆర్​ పేర్కొన్నారు. వివిధ ప్యాకేజీల కింద చేపట్టిన లింక్​రోడ్లలో అక్కడక్కడా ఆటంకంగా ఉన్న భూముల సేకరణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు సూచించారు. అదే సమయంలో నిర్వాసితుల పట్ల మానవీయకోణంలో వ్యవహరించాలన్నారు.

హైదరాబాద్ నగర మాస్టర్​ ప్లాన్​ను అప్​డేట్ చేయనున్నట్లు ప్రకటించిన మంత్రి.. అందుకనుగుణంగా రోడ్ల నిర్మాణానికి అవసరమైన భూసేకరణ చేయాలని తెలిపారు. నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్​ పాసులు, రైల్వే ఓవర్ బ్రిడ్జిలతో పాటు కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలకు కూడా అవసరమైన భూ సేకరణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులు, భూసేకరణకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి:ఆ జోన్లలో మద్యం దుకాణాలు తెరుచుకునే అవకాశం!

ABOUT THE AUTHOR

...view details