హైదరాబాద్‌లో మెట్రో ట్రైన్ సేవలను ఉదయం 6 గంటల నుంచే ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని.. అభినవ్(KTR tweet on metro) అనే ప్రయాణికుడి ట్విట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఉదయం 6 గంటల నుంచే మెట్రో రైలు(KTR tweet on metro) కోసం ప్రయాణికులు స్టేషన్లకు వస్తున్నారని చెప్పారు. కానీ 7 గంటలకు ప్రారంభమవుతుండటంతో సుమారు గంటపాటు వేచిచూడాల్సి వస్తోందని తెలిపారు. అందుకు సంబంధించిన వీడియోను కేటీఆర్‌కు ట్వీట్ చేశారు.
ఉదయం సమయంలో క్యాబ్ రేట్లు అధికంగా ఉంటున్నాయని అభినవ్ ట్వీట్(KTR tweet on metro)లో తెలిపారు. అందువల్ల మెట్రో సేవలను ముందుకు జరిపే విషయం పరిశీలించాలని కేటీఆర్‌ను కోరారు. స్పందించిన మంత్రి కేటీఆర్... ఉదయం 6 గంటల నుంచే మెట్రో సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే అంశం పరిశీలించాలని ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి కేటీఆర్ రీట్వీట్ చేశారు.