నేను వ్యక్తిగతంగా అన్ని బిల్డర్లతో వెంటనే సమావేశం జరిపిస్తానని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్టర్‌లో పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికుల శ్రేయస్సు కోసం అభ్యర్థిస్తానన్నారు.
వలస కార్మికుల పట్ల.. మంత్రి కేటీఆర్ స్పందన - కేటీఆర్ ట్వీట్టర్
ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికుల పట్ల మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. వారి శ్రేయస్సు కోసం రోడ్డు పనుల గురించి బిల్డర్లతో చర్చించినట్లు పేర్కొన్నారు. మహ్మాద్ ఇమ్రాన్ అనే వ్యక్తి పలు రాష్ట్రాల కార్మికులను ఆదుకోవాలని కోరారు.
వలస కార్మికుల పట్ల.. మంత్రి కేటీఆర్ స్పందన
మహ్మాద్ ఇమ్రాన్ అనే వ్యక్తి ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా, బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల కార్మికులను ఆదుకోవాలని కోరగా... మంత్రి స్పందించారు. ఇప్పటికే రోడ్డు పనుల కాంట్రాక్టర్లతో ఆ విషయంపై చర్చించినట్లు తెలిపారు.
ఇదీ చూడండి :'ఆ నియోజకవర్గంలో ఇప్పటికి ఒక్క కేసు నమోదు కాలేదు'