ktr tweet Saroor Nagar honor killing: హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జరిగిన నాగరాజు పరవుహత్యపై మంత్రి కేటీఆర్ స్పందించారు. నిందితులకు చట్టప్రకారం కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డిని కోరారు. నాగరాజు హత్య కేసు నిందితులను 24గంటల్లో అరెస్టు చేసినట్లు రాచకొండ పోలీసులు చేసిన ట్వీట్‌పై ఆయన స్పందించారు. ఘటనపై వేగంగా స్పందించారంటూ రాచకొండ పోలీసులకు మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
అసలేం జరిగిదంటే..
రంగారెడ్డి జిల్లా మర్పల్లి గ్రామానికి చెందిన బిల్లాపురం నాగరాజు, మర్పల్లి సమీపంలోని ఘనాపూర్ గ్రామంలో నివసించే సయ్యద్ ఆశ్రిన్ సుల్తానా.. ఏడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం తెలిసి ఆశ్రిన్ కుటుంబ సభ్యులు అతడిని హెచ్చరించారు. ఆశ్రిన్‌ను పెళ్లిచేసుకుందామని నిర్ణయించుకున్న నాగరాజు.. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ కార్ల కంపెనీలో కొద్దినెలల కిందట సేల్స్‌మన్‌గా చేరాడు. కొత్త సంవత్సరం రోజు ఆశ్రిన్‌ను రహస్యంగా కలుసుకున్న నాగరాజు కొద్దిరోజుల్లో పెళ్లి చేసుకుందామని చెప్పాడు. అంగీకరించిన ఆశ్రిన్.. జనవరి చివరి వారంలో పారిపోయి హైదరాబాద్‌కు వచ్చింది. లాల్‌దర్వాజలోని ఆర్యసమాజ్‌లో జనవరి 31న ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు.