తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR on Lakhimpur Kheri incident: 'లఖింపుర్ ఖేర్ ఘటన అనాగరికం' - తెలంగాణ వార్తలు

లఖింపుర్ ఖేర్ ఘటనపై మంత్రి కేటీఆర్(KTR on Lakhimpur Kheri incident) స్పందించారు. రైతులపై జరిగిన ఈ క్రూరమైన ఘటన(Lakhimpur Kheri News) తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు.

KTR on Lakhimpur Kheri incident, ktr twitter
లఖింపుర్ ఖేర్ ఘటనపై మంత్రి కేటీఆర్, కేటీఆర్ ట్విటర్

By

Published : Oct 5, 2021, 11:07 AM IST

లఖింపుర్ ఖేర్ ఘటనను మంత్రి కేటీఆర్(KTR on Lakhimpur Kheri incident) ఖండించారు. రైతులపై జరిగిన హింసాత్మక ఘటన(Lakhimpur Kheri News) తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. అనాగరిక ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఏం జరిగింది?

ఉత్తర్​ప్రదేశ్ లఖింపుర్ ఖేరిలో(Lakhimpur Kheri incident) రైతులపైకి కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడి వాహనం దూసుకెళ్లిన వీడియో ప్రస్తుతం అంతర్జాలంలో చక్కర్లు కొడుతోంది. ఇవి ఉపముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య పర్యటన సందర్భంగా జరిగిన హింస తాలూకు దృశ్యాలేనని తెలుస్తోంది. ప్లకార్డులు, బ్యానర్లు చేతపట్టుకొని నిరసన చేస్తున్న అన్నదాతలపైకి ఓ వాహనం వేగంగా దూసుకు రావడం వీడియోలో కనిపిస్తోంది. మిర్జాపుర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత లలితేశ్ పాటి త్రిపాఠి ఈ వీడియోను ట్వీట్ చేశారు. లఖింపుర్ ఖేరి హింసాకాండకు ఇదే రుజువు అని చెప్పారు.

హై అలెర్ట్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో(Lakhimpur Kheri News) చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా జిల్లాలో 144వ సెక్షన్‌ను విధించారు. అంతర్జాల సేవలనూ నిలిపివేశారు. ఘటనా స్థలానికి చేరుకునేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, సమాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ తదితరులను పోలీసులు అడ్డుకున్నారు.

పలువురిపై కేసులు

ఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి కుమారుడు సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రను పదవి నుంచి తొలగించాలని, ఆయన కుమారుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా డిమాండ్‌ చేసింది. ఘటనను నిరసిస్తూ పలు ప్రతిపక్ష పార్టీల నేతలు భాజపాపై ఘాటు విమర్శలు చేశారు. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే విపక్ష నేతలు రాజకీయ పర్యటనలు చేస్తున్నారని యోగి సర్కారు ఆరోపించింది.

పదవి నుంచి తొలగించాలని డిమాండ్

అజయ్‌ మిశ్రను మంత్రి పదవి నుంచి తొలగించాలని, ఆయన కుమారుడిపై హత్యానేరం కింద కేసు నమోదు చేయాలని సంయుక్త కిసాన్‌ మోర్చా డిమాండ్‌ చేసింది. ఈ మేరకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు లేఖ రాసింది. ఘటనపై విచారణకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని అభ్యర్థించింది. మరోవైపు- లఖింపుర్‌ ఖేరి ఘటనకు నిరసనగా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర సహా... అన్ని రాష్ట్రాల జిల్లా కేంద్రాల్లో ఆందోళన చేపట్టినట్టు వెల్లడించింది. భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ టికాయిత్‌ సోమవారం ఉదయాన్నే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరణించిన రైతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మంత్రిని పదవి నుంచి తొలగించాలన్నారు. డిమాండ్లు నెరవేర్చేవరకూ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించబోమని హెచ్చరించారు. భాజపా కార్యకర్తలెవరూ ఉత్తర్‌ప్రదేశ్‌ గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించవద్దని మరో నేత నరేశ్‌ టికాయిత్‌ హెచ్చరించారు. ఘటన జరిగిన సమయంలో అక్కడ తాను, తన కుమారుడు లేమని మంత్రి చెప్పడాన్ని కొందరు రైతులు ఖండించారు. మంత్రి కుమారుడు ఆశిష్‌ స్వయంగా తుపాకీతో బెదిరించినట్టు ఆరోపించారు.

ఇవీ చదవండి:

Lakhimpur Kheri News: లఖింపుర్ ఘటనపై ఉవ్వెత్తున నిరసన జ్వాల..

ABOUT THE AUTHOR

...view details