White Challenge: ఎలాంటి పరీక్షలకైనా సిద్ధంగా ఉన్నా: మంత్రి కేటీఆర్ - minister ktr white challenge news
09:28 September 20
రేవంత్‌రెడ్డి వైట్ ఛాలెంజ్‌పై స్పందించిన మంత్రి కేటీఆర్
రేవంత్ రెడ్డి వైట్ ఛాలెంజ్‌పై ( Revanth Reddy White Challenge) ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ( MINISTER KTR ) స్పందించారు. తాను దిల్లీ వెళ్లి ఎయిమ్స్‌లో ఎలాంటి పరీక్షలు చేయించుకోడానికైనా సిద్ధంగా ఉన్నానని ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు. అయితే రాహుల్ గాంధీ (Rahul Gandhi) కూడా పరీక్షలు చేయించుకోవాలని సవాల్ చేశారు. చర్లపల్లి జైలు వెళ్లొచ్చిన వారితో తన స్థాయి కాదని... కేటీఆర్ (KTR) వ్యంగ్యాస్త్రం సంధించారు. పరీక్షలలో తనకు నెగెటివ్ వచ్చి క్లీన్చిట్ లభిస్తే... రేవంత్ (Revanth) క్షమాపణ చెప్పి పదవులు వదులుకుంటారా అని ప్రశ్నించారు. మరోవైపు రేవంత్ ఓటుకు నోటుకు (vote for note case) వ్యవహారంలో లైడిటెక్టర్ పరీక్షలు సిద్దమా అని కూడా ట్విట్టర్ ద్వారా ప్రశ్నించారు.
మరోవైపు రేవంత్‌రెడ్డి వైట్ ఛాలెంజ్‌కు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి (ex mp konda vishweshwara reddy) స్పందించారు. రేవంత్‌రెడ్డి వైట్ ఛాలెంజ్‌లో ( Revanth Reddy White Challenge) విశ్వేశ్వరరెడ్డి పాల్గొననున్నారు. మ.12 గం.కు గన్‌పార్క్ (gunpark) అమరవీరుల స్థూపం వద్దకు రానున్నారు. రేవంత్‌రెడ్డి వైట్ ఛాలెంజ్‌పై మాణికం ఠాగూర్ ట్వీట్ చేశారు. వైట్ ఛాలెంజ్‌ను విశ్వేశ్వరరెడ్డి స్వీకరించడం మంచి పరిణామమని వెల్లడించారు.