తెలంగాణ

telangana

ETV Bharat / state

Virinchi issue: విరించి ఆస్పత్రి ఘటనపై స్పందించిన మంత్రి కేటీఆర్ - తెలంగాణ తాజా వార్తలు

విరించి (Virinchi) ఆస్పత్రి ఘటనపై మంత్రి కేటీఆర్​ స్పందించారు. ఓ నెటిజన్​ విజ్ఞప్తిపై స్పందించిన మంత్రి ఆస్పత్రి ఘటనపై విచారణ వేగవంతం చేయాలని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావును ఆదేశించారు.

minister ktr on virinchi
minister ktr on virinchi

By

Published : May 28, 2021, 6:48 PM IST

హైదరాబాద్‌లోని విరించి(Virinchi) ఆస్పత్రి ఘటనపై విచారణ వేగవంతం చేసి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్​ (KTR).. ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావును ఆదేశించారు. విరించి ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వంశీకృష్ణ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడంటూ మంత్రి కేటీఆర్​కు.. ముబషిర్ అనే వ్యక్తి ట్వీట్‌(Tweet) చేశారు. ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

గతేడాది వైద్యుల నిర్లక్ష్యం, అధిక ఫీజుల వసూలు వంటి కారణాలతో విరించి ఆస్పత్రి (Virinchi) లైసెన్స్ రద్దయిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. గురువారం కూడా ఇదే తరహా ఘటన పునరావృతమైందని ముబషిర్ ట్విట్టర్‌లో ప్రస్తావించారు. విచారణ ముగిసే వరకు సంబంధిత ఆస్పత్రిని మూసేయాలని నెటిజన్ విజ్ఞప్తి చేయగా.. స్పందించిన మంత్రి కేటీఆర్​ (KTR) విషయాన్ని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. విచారణ వేగవంతం చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇదీ చూడండి:ktr: రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుతోంది: కేటీఆర్‌

ABOUT THE AUTHOR

...view details