రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన నల్లమల యురేనియం తవ్వకాలపై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్‌తో వ్యక్తిగతంగా చర్చిస్తానని పేర్కొన్నారు. ఇప్పటికే విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ధర్నాలు, ర్యాలీలంటూ యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా చేపట్టనున్న కార్యచరణపై నేతలు ప్రకటనలు చేస్తున్నారు. మరోవైపు తెలుగు సినీ తారలు సామాజిక మధ్యమాలలో పెద్ద ఎత్తున తమ గళం వినిపిస్తున్నారు. సేవ్ నల్లమల పేరిట ప్రజలు తమ ఆవేదనను తెలియజేస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందించారు.
నల్లమల యురేనియం తవ్వకాలపై నాన్నతో మాట్లాడతా...! - సీఎం కేసీఆర్
రాష్ట్రంలో ప్రస్తుతం వేడి రాజేస్తున్న నల్లమల యురేనియం తవ్వకాలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ విషయంపై ప్రజలు పడుతున్న ఆవేదన తమ దృష్టికి వచ్చినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఎన్నో సందేశాలు... 'సేవ్ నల్లమల' పేరిట టాలీవుడ్ తారలు చేస్తున్న క్యాంపెయిన్‌పై స్పందించారు.
MINISTER KTR RESPONDED ON NALLAMALA URANIUM ISSUE ON TWITTER WHICH IS TRENDING WITH #SAVE NALLAMALA
నల్లమలలో యురేనియం తవ్వకాలపై ప్రజల ఆవేదన మా దృష్టికి వచ్చింది. వ్యక్తిగతంగా ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇస్తున్నాను: మంత్రి కేటీఆర్.
ఇవీ చూడండి: ఫాలో అవడం అంటే మరీ ఇలా చేయాలా...!