తెలంగాణ

telangana

ETV Bharat / state

ఐదేళ్లలో  ఇసుక ఆదాయం రూ.2842 కోట్లు - sand

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం తీసుకున్న నిర్ణయాల వల్ల ఇసుక ఆదాయం గణనీయంగా పెరిగిందని అసెంబ్లీలో  మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు.

sand

By

Published : Sep 16, 2019, 7:30 PM IST




రాష్ట్ర వ్యాప్తంగా మినరల్​, మైనింగ్ ఆదాయం 2008 నుంచి 2014 వరకు రూ.7,360 కోట్లు వస్తే... 2014 నుంచి 2019 ఆగస్టు వరకు రూ.16,937 కోట్లు ఆదాయం వచ్చిందని మంత్రి కేటీఆర్​ స్పష్టం చేశారు. బడ్జెట్​పై చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అక్రమ మైనింగ్​కు అడ్డుకట్ట వేయటం వల్ల ఇది సాధ్యమైందని మంత్రి తెలిపారు. ఇసుక విషయంలో చాలా కఠినంగా వ్యవహరించామన్నారు. రాష్ట్రంలో 2007-2014 వరకు రూ 39.66 కోట్ల ఆదాయం వస్తే... 2014-19 ఆగస్టు వరకు రూ.2,842 కోట్లు ఆదాయం వచ్చిందని కేటీఆర్​ పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఈ ఆదాయం ఎటు పోయిందో కాంగ్రెస్​ నేతలు తెలుసుకోవాలని హితవు పలికారు.

ఐదేళ్లలో ఇసుక ఆదాయం రూ.2842 కోట్లు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details