తెలంగాణ

telangana

By

Published : Dec 25, 2021, 8:11 PM IST

ETV Bharat / state

Ktr respond on Agri Laws: రద్దు చేసిన వాటిని మళ్లీ తెస్తామనడం అద్భుతం: కేటీఆర్

Ktr respond on Agri Laws: సాగు చట్టాలపై కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. ప్రధాని మోదీ క్షమాపణలు చెప్పి రద్దు చేసిన చట్టాలను మళ్లీ తీసుకొస్తామనడం ఎన్నికల స్టంటేనా అని విమర్శించారు. కేంద్ర వ్యవసాయశాఖమంత్రి నరేంద్రసింగ్ తోమర్ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ప్రశ్నించారు.

Ktr respond on Agri Laws
కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్

Ktr respond on Agri Laws: సాగు చట్టాలపై ప్రధాని మోదీ క్షమాపణలు కేవలం ఎన్నికల స్టంటేనా మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. రద్దు చేసిన చట్టాలను మళ్లీ తీసుకొస్తామన్న కేంద్రమంత్రి వ్యాఖ్యలపై ట్విట్టర్​ వేదికగా మంత్రి విమర్శించారు. ప్రధాని రద్దు చేస్తే కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి మళ్లీ తెస్తామనటం చాలా అద్భుతంగా ఉందని ఎద్దేవా చేశారు.

ktr on central minister: భాజపా పట్ల దేశ రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు. కేవలం ఎన్నికల కోసం భాజపా ప్రభుత్వం కొత్త డ్రామాలకు తెర తీసిందని ఆరోపించారు. ఇలాంటి ప్రకటనలతో భాజపా పూర్తి రైతు వ్యతిరేక ప్రభుత్వంగా మారిపోయిందన్నారు. పీఎం నరేంద్రమోదీ రద్దు చేసిన వ్యవసాయ చట్టాలను మళ్లీ ప్రతిపాదించడం అద్భుతమని వ్యాఖ్యానించారు.

pm on agri laws: రైతుల ఉద్యమంతో ఇటీవలే జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే అంశంపై ప్రధాని మోదీ రైతులకు క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం రైతులు ఉద్యమానికి తాత్కాలిక విరామం ఇచ్చారు. కేంద్రం హామీలతో రైతులు ఉద్యమాన్ని విరమించుకున్నారు. తాజాగా కేంద్రమంత్రి వ్యాఖ్యలతో మళ్లీ సాగు చట్టాలపై చర్చ మొదలైంది.

ABOUT THE AUTHOR

...view details