తెలంగాణ

telangana

ETV Bharat / state

అమీర్​పేట మెట్రో ఘటనపై మంత్రి కేటీఆర్ సీరియస్..

అమీర్​పేట మెట్రోస్టేషన్​ ప్రమాదంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనను ఇంజినీరింగ్​ నిపుణులు పరిశీలించి సూచనలు ఇవ్వాలని కేటీఆర్ ట్విట్టర్​ ద్వారా అధికారులను​ ఆదేశించారు.

'అమీర్​పేట ఘటనలాంటివి పునరావృతం కాకూడదు '

By

Published : Sep 23, 2019, 8:30 PM IST

అమీర్​పేట మెట్రో ఘటన అనుకోని సంఘటన అయినప్పటికీ దాన్ని తీవ్రంగా పరిగణించాలని మంత్రి కేటీఆర్​ పేర్కొన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలకు ఉపక్రమించాలని అధికారులకు ట్విట్టర్​ వేదికగా సూచించారు. అన్ని స్టేషన్ నిర్మాణాలు, సౌకర్యాలను క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఇంజినీరింగ్​ అధికారులను ఆదేశించారు. నాణ్యత, భద్రతా అంశంలో సాధించిన ఖ్యాతిని హైదరాబాద్ మెట్రో కొనసాగించాలని చెప్పారు. భద్రతకు అన్ని సమయాల్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించిన మంత్రి కేటీఆర్‌... బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారు. మృతురాలి కుటుంబానికి పరిహారం చెల్లించాలని ఎల్​అండ్​టీ యాజమాన్యానికి సూచించారు. మృతురాలి కుటుంబ సభ్యులతో చర్చించిన ఎల్​అండ్​టీ యాజమాన్యం రూ.20 లక్షలు పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details