పెట్రోల్, డీజిల్ పెంపును నిరసిస్తూ... వాటిలో భాగంగా సిలీండర్లు, ద్విచక్రవాహనాలు చెరువుల్లో పడేయటంపై మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతూ సామాన్యుల జేబులకు చిల్లు పెడుతున్నాయి. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ.100 దాటగా.. మరిన్ని ప్రాంతాల్లో సెంచరీకి అడుగు దూరంలో ఉంది. ఈ అంశంపై నిరసనలు చేస్తూ... కొందరు అత్యుత్సాహం చూపిస్తున్నారని... వారు చేసిన చర్యలు పూర్తిగా ఖండించదగినవని అన్నారు.
''జూన్ నెలలో పెట్రోల్, డీజిల్ పెంపునకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వివిధ రకాలుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ (Youth Congress) హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మోత రోహిత్, ప్రధాన కార్యదర్శి శైలేందర్ ద్విచక్ర వాహనంపై వచ్చారు. నిరసనలో భాగంగా ట్యాంక్ బండ్లో తాము ప్రయాణించిన బైక్‌ను విసిరేసి అత్యుత్సాహం చూపించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలిపారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి పేద, సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతోందని యూత్ కాంగ్రెస్ (Youth Congress) నాయకులు ఆరోపించారు. తక్షణమే పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని.. ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Youth Congress : ట్యాంక్‌బండ్‌లో బైక్ విసిరేసిన యూత్ కాంగ్రెస్ నాయకులు
గ్యాస్ ధర 25 రూపాయల పెంపు వ్యతిరేకిస్తూ.. నిరసనలో భాగంగా నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ వుమెన్ కార్యకర్తలు సిలిండర్‌ను హుస్సేన్ సాగర్ నీటిలో వేశారు.''