ఆ వీడియోను పూర్తిగా చూడండి: మంత్రి కేటీఆర్ - తడి, పొడి చెత్త
తడి, పొడి చెత్తను వేరుచేసి పారిశుద్ధ్య కార్మికులకు సహకరించాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. ముంబయిలో పారిశుద్ధ్య కార్మికులు, వారి స్థితిగతులకు సంబంధించి రతన్ టాటా ట్విట్టర్లో పొందుపర్చిన సందేశాన్ని ప్రస్తావిస్తూ మంత్రి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పారిశుధ్య కార్మికుడైన తన తండ్రి వృత్తిని గురించి ఓ విద్యార్థి చెబుతున్న ఓ వీడియోను రతన్ టాటా ట్వీట్ చేశారు. ఆ వీడియోను పూర్తిగా చూడాలని కోరిన కేటీఆర్... తడి, పొడి చెత్తను వేరుచేయాలని విజ్ఞప్తి చేశారు.
![ఆ వీడియోను పూర్తిగా చూడండి: మంత్రి కేటీఆర్ Minister KTR Twitter post today news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6116206-564-6116206-1582027020499.jpg)
Minister KTR Twitter post today news