కరోనా వైరస్‌పై ప్రత్యేక గీతాన్ని మంత్రి కేటీఆర్ ప్రగతిభవన్‌లో ఆవిష్కరించారు. కొవిడ్-19ను కట్టడి చేయడంలో కీలకపాత్ర వహిస్తున్న వివిధ శాఖల సిబ్బంది సేవలను గుర్తిస్తూ.. జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి ఈ ప్రత్యేక గీతాన్ని నిర్మించారు. ఈ గీతాన్ని ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఆలపించగా... కందికొండ సాహిత్యాన్ని అందించారు. ఈ ప్రత్యేక గీతం చాలా బాగా వచ్చిందని కచ్చితంగా ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తుందని మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. వైరస్ కట్టడి కోసం పనిచేస్తున్న వారి పట్ల గౌరవాన్ని పెంచుతుందన్నారు. ఈ పాటను నిర్మించిన బొంతు శ్రీదేవితో పాటు మేయర్ రామ్మోహన్‌ను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు.
కరోనా వైరస్‌పై ప్రత్యేక గీతం... ఆవిష్కరించిన కేటీఆర్ - కరోనాపై ప్రత్యేక గీతం విడుదల చేసిన కేటీఆర్
కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా పనిచేస్తున్న వివిధ సిబ్బంది సేవలను గుర్తిస్తూ... జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ సతీమణి శ్రీదేవి ఈ ప్రత్యేక గీతాన్ని నిర్మించారు. ఈ గీతాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.
కరోనా వైరస్‌పై ప్రత్యేక గీతం.