ఆచార్య జయశంకర్‌పై స్ఫూర్తి గీతాన్ని హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. దేశపతి శ్రీనివాస్ ఈ పాటను రచించి గానం చేశారు. ఈ గీతంలో.. ముల్కీ, 1969, మలిదశ తెలంగాణ ఉద్యమాలతో ముడిపడిన జయశంకర్ జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించారు.
ఆచార్య జయశంకర్‌పై స్ఫూర్తి గానం.. ఆవిష్కరించిన కేటీఆర్ - మంత్రి కేటీఆర్ తాజా వార్తలు
ఆచార్య జయశంకర్‌పై స్ఫూర్తి గేయాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. దేశపతి శ్రీనివాస్ ఈ పాటను రచించారు. తెలంగాణ ఉద్యమాలతో ముడిపడిన జయశంకర్ జీవితం ప్రతిబింబించేలా పాటను రాసినందుకు ఆయనను కేటీఆర్ కొనియాడారు.

ఆచార్య జయశంకర్, ఆచార్య జయశంకర్‌పై గానం
మంచి సాహిత్య విలువలున్న పాటను జయశంకర్ స్మృతిలో రాసి పాడిన శ్రీనివాస్‌ను కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. అరుదైన ఫొటోలతో చిత్రీకరణ చేశారని ప్రశంసించారు.