KTR Released Municipal Department Decade Report : పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన బేగంపేట మెట్రోభవన్‌లో తెలంగాణ ఏర్పాడిన తరువాత పురపాలక శాఖ సాధించిన విజయాలు, అభివృద్ధి నివేదికను కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తొమ్మిదేళ్లలో పురపాలక శాఖ ద్వారా రూ.లక్షా 21వేల కోట్లు ఖర్చుచేశామని తెలిపారు. అంతకుముందు ప్రభుత్వాలు అప్పట్లో రూ. 26వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసేవారని పేర్కొన్నారు. ఈ పదేళ్లలో పురపాలక శాఖ కోసం 462శాతం ఎక్కువ నిదులు ఖర్చు చేశామన్నారు.
Electric buses in Hyderabad : హైదరాబాద్‌లో అన్ని ఆర్టీసీ బస్సులు ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తామని ప్రకటించారు. అలాగే భాగ్యనగరంలో త్వరలోనే 1000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభిస్తామని తెలిపారు. 111 జీవో ఎత్తివేతకు విధివిధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. నగర అభివృద్ధి కోసం అనేక ఎస్‌పీవీలు ఏర్పాటు చేశామని అన్నారు. ఎస్‌ఆర్‌డీపీ ద్వారా 35 వరకు ఫ్లైఓవర్‌లు నిర్మించామని గుర్తు చేసుకున్నారు. కానీ ఉప్పల్, అంబర్‌పేట ఫ్లైఓవర్లను జాతీయ హైవే సంస్థ పూర్తి చేయలేకపోతోందని మండిపడ్డారు.
- Uppal Skywalk Inauguration : భాగ్యనగరం సిగలో మరో మణిహారం.. నేడే ఉప్పల్ స్కైవాక్ ప్రారంభం
- KTR on Hyderabad Development : 'మానవ వనరులు, నైపుణ్యానికి రాజధాని హైదరాబాద్'
తమ ప్రభుత్వం 35ఫ్లైఓవర్లు పూర్తి చేస్తే.. కేంద్ర ప్రభుత్వం 2 ఫ్లైఓవర్లు కూడా పూర్తి చేయలేకపోతున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో ప్రధాన రహదారుల నాణ్యత పెరిగిందని హర్షం వ్యక్తం చేశారు. పురపాలక శాఖకు కేంద్రం కూడా 26 అవార్డులను ఇచ్చి గుర్తించిందని సంతోషం వ్యక్తం చేశారు. కొత్త పురపాలక చట్టం తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని కొనియాడారు. ఈ పదేళ్లలో చట్టబద్ధంగా రావాల్సింది తప్ప కేంద్రం రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదని ఆరోపించారు.