పరిశ్రమల శాఖ వార్షిక ప్రగతి నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్తో కలిసి నివేదికను విడుదల చేసిన మంత్రి... జాతీయ జీఎస్డీపీ సగటుతో పోలిస్తే తెలంగాణ 8.2 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా గత ఏడాది నమోదైన 4.55 శాతంతో పోలిస్తే 2019- 20 సంవత్సరానికి 4.76 శాతంగా నమోదైందని అన్నారు. తలసరి ఆదాయం విషయంలోనూ జాతీయ సగటు రూ. 1,34,432తో పోల్చినప్పుడు రాష్ట్ర ఆదాయం రూ. 2,28,216గా నమోదైందని కేటీఆర్ తెలిపారు.
పెరిగిన ఎగుమతుల శాతం..
దేశ ఎగుమతుల్లోనూ... తెలంగాణ వాటా 10.61 శాతం నుంచి 11.58 శాతానికి పెరిగిందని మంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక టీఎస్ఐపాస్ విధానం అద్భుతమైన ఫలితాలను అందించిందని, ముఖ్యంగా సరళతర వాణిజ్య విధానంలో మొదటి స్థానంలో నిలిచే అవకాశం కల్పించిందని అన్నారు. టీఎస్ఐపాస్ ఇప్పటిదాకా ద్వారా వచ్చిన పెట్టుబడుల మొత్తం సంఖ్య రూ. 1,96,404 కోట్లు నమోదైందన్నారు. అనుమతులు పొందిన 12,021 పరిశ్రమల్లో 75 శాతానికి పైగా తమ కార్యకలాపాలను ప్రారంభించాయని కేటీఆర్ వివరించారు.
హైదరాబాద్కు ప్రథమస్థానం..
రానున్న రోజుల్లో సుమారు రూ. 45,848 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి మెగా ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్టుల రూపంలో రానున్నాయని... తద్వారా సుమారు 83 వేల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని చెప్పారు. భారతదేశంలోనే అత్యధికంగా నెట్ ఆఫీస్ అబ్సార్ప్షన్ విషయంలో హైదరాబాద్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని అన్నారు. ప్రస్తుతం కరోనా సంక్షోభంలోనూ... తెలంగాణలోని పరిశ్రమలు పెద్దఎత్తున ప్రభుత్వానికి అండగా నిలిచాయన్న కేటీఆర్... సుమారు సుమారు రూ. 150 కోట్లకు పైగా నిధులను, ఇతరత్రా రూపంలో అందించాయని తెలిపారు.
మరింత బలోపేతం..