KTR React on Bandi Sanjay Comments: కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తారంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. సంజయ్‌ను ఇలాగే వదిలెయ్యకండి భాజపా బాబులు అంటూ ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మతి లేని మాటలతో సమాజానికి ప్రమాదకరంగా తయారయ్యాడని పేర్కొన్నారు. పిచ్చి ముదిరి తొందరలో కరవడం కూడా మొదలు పెడతారేమో.. ఎర్రగడ్డలో ఆయన కోసం బెడ్ తయారుగా ఉందని ఎద్దేవా చేశారు. తొందరగా తీసుకెళ్లి వైద్యం చేయించుకోండి అని భాజపా నేతలకు కేటీఆర్ సూచించారు.
సంజయ్ ఏం అన్నారంటే..:కేసీఆర్ ఫామ్‌హౌజ్‌లో క్షుద్రపూజలు చేసి ద్రవాలు కాళేశ్వరంలో కలిపారని బండి సంజయ్ ఆరోపించారు. మూడు నెలలకు ఓసారి నల్లపిల్లితో కేసీఆర్ పూజలు చేస్తారని తీవ్ర ఆరోపణలు చేశారు. స్వప్రయోజనాల కోసం కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్.. నల్ల పిల్లితో తాంత్రిక పూజలు చేయిస్తారన్నారు. మునుగోడులో తెరాస గెలవాలని క్షుద్రపూజలు చేయిస్తున్నారని ఆరోపించారు.