రాష్ట్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలకు అర్హులైన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి.. ప్రభుత్వానికి పంపేందుకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దరఖాస్తుల ఉద్యమం ప్రారంభించారు. దీనిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
'మీ దరఖాస్తుల ఉద్యమం ఆహ్వానించ తగ్గదే. తెలంగాణ భాజపా శాఖ నిర్ణయాన్ని నేను కూడా స్వాగతిస్తున్నా. ప్రధాని నరేంద్ర మోదీ వాగ్ధానం మేరకు ప్రతి పౌరుడికి రూ.15 లక్షలు ఇవ్వాలి. జన్‌ధన్ ఖాతాల్లోకి డబ్బులు పండేందుకు దరఖాస్తులు పంపాలి. ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోండి.'
-మంత్రి కేటీఆర్
అసలు ఏంటీ దరఖాస్తుల ఉద్యమం?
రాష్ట్రంలో తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు బండి సంజయ్ ప్రయత్నించగా.. మంత్రి కేటీఆర్ సంజయ్‌పైనే కౌంటర్ వేశారు. సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ హామీలను అమలయ్యేలా ఒత్తిడి తీసుకొచ్చి, తెలంగాణ ప్రజలకు మేలు చేకూర్చేలా దరఖాస్తుల ఉద్యమం చేస్తున్నట్లు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. ‘బీసీ బంధు’, ‘గిరిజన బంధు’ పథకాలను ప్రభుత్వం వెంటనే రూపొందించి... రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 60 లక్షల మంది బీసీ కుటుంబాలు, 10 లక్షల గిరిజన, ఆదివాసీ కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున లబ్ధి ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీటితోపాటు నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూం ఇళ్లు, దళిత, గిరిజనులకు 3 ఎకరాల భూమి, రైతు రుణమాఫీ హామీలను అమలు చేయాలని కోరుతూ... అర్హులైన వారు దరఖాస్తు చేయాలని.. సూచించారు. ఈనెల 24 నుంచి చేపట్టనున్న ‘ప్రజా సంగ్రామ యాత్ర’లో పాదయాత్ర దారిపొడవునా దరఖాస్తుల ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఎవరూ చేయట్లే...
ఇటు రాష్ట్రం, అటు కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నేరవేర్చడంలేదని అర్థమవుతోంది. ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలను మభ్య పెట్టేందుకే ఈ హామీలను ఇస్తున్నారని... గెలిచిన తర్వాత వాటిని విస్మరిస్తున్నారని మరోమారు స్పష్టమైంది.
ఇదీ చూడండి:Bandi sanjay: దళిత బంధు సభకు మీడియాను ఎందుకు అనుమతించరు.?