వ్యాపార రంగం విషయంలో ప్రభుత్వ జోక్యం ఎంత తక్కువగా ఉంటే అంత మంచిదని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని టీఎస్‌ఐపాస్‌లో కీలక నిబంధనలు పొందుపర్చామని వివరించారు. హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో... వివిధ రంగాల్లో రాణిస్తున్న వారికి ఇచ్చే ఎక్సలెన్సీ అవార్డుల ప్రదానోత్సవానికి... కేటీఆర్ హాజరయ్యారు. మొత్తం 19 కేటగిరీల్లో అవార్డులు అందజేశారు.
పరిశ్రమల విషయంలో ఒకప్పుడు గుజరాత్ మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలు ముందుండేవన్న ఆయన... ఇప్పుడు తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు. సులభతర వాణిజ్యంలో ఎక్కువసార్లు.. రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచినట్లు గుర్తుచేశారు. దేశంలో ప్రాంతాలను బట్టి ఆయా భాష మాట్లాడుతుంటారన్న ఆయన... భాషను బట్టి ప్రతిభను అంచనా వేయవద్దని తెలిపారు.