తెలంగాణ

telangana

ETV Bharat / state

వచ్చే నెలలో టీ-వర్క్స్ ప్రారంభమౌవుతాయి: కేటీఆర్

ఆన్​లైన్ వేదికగా టై- హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్న టై-గ్లోబల్ సమ్మిట్​లో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. టై గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్​లో స్థాపించాలనుకోవటం సంతోషమని మంత్రి హర్షం వ్యక్తం చేశారు.

వచ్చే నెలలో టీ-వర్క్స్ ప్రారంభమౌవుతాయి: కేటీఆర్
వచ్చే నెలలో టీ-వర్క్స్ ప్రారంభమౌవుతాయి: కేటీఆర్

By

Published : Dec 8, 2020, 9:38 PM IST

కొన్ని నెలల్లో టీ హబ్ ఫేస్-2, వచ్చే నెలలో టీ-వర్క్స్ ప్రారంభమౌతాయని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆన్​లైన్ వేదికగా టై- హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో జరుగుతున్న టై-గ్లోబల్ సమ్మిట్​లో ఆయన పాల్గొన్నారు. కొవిడ్ సమయంలో పదో వంతు ఖర్చుతో పూర్తి స్థాయి వెంటిలేటర్, కొవిడ్ టెస్టింగ్ కిట్, క్వారంటైన్​కు సంబంధించి యాప్ ఆవిష్కరణలు జరిగాయని తెలిపారు.

ఎంటప్రిన్యూయార్ షిప్​ను వృద్ధి చేసేందుకు కావాల్సిన వాతావరణం సృష్టించేందుకు ప్రపంచ స్థాయి సంస్థలను స్థాపించామని పేర్కొన్నారు. టై గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్​లో స్థాపించాలనుకోవటం సంతోషమని, దీనిపై కలిసి పనిచేస్తామని తెలిపారు.

టై-గ్లోబల్ సమ్మిట్​లో కేటీఆర్

ఇదీ చూడండి:జోరుమీదున్న భాజపా.. సత్తా చాటేందుకు వ్యూహాలు

ABOUT THE AUTHOR

...view details