తెలంగాణ నేతన్నలకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని (National Handloom Day) పురస్కరించుకుని.... హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు. అనంతరం, చేనేత కళాకారులతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు. చేనేత కార్మికులకు ఉపాధి, ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్న కేటీఆర్.... 'ఈ-కామర్స్' ద్వారా నేతన్నలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు.
'నేతన్నకు చేయూత' (nethanna cheyutha scheme) కింద రూ.30 కోట్ల చెక్కు అందించారు. నేతన్నల ఉత్పత్తులు ప్రోత్సహించేందుకు చేనేత దినోత్సవం (National Handloom Day) జరుపుతున్నట్లు స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో ఏటా చేనేత దినోత్సవం జరుగుతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ నేతన్నలు భారతీయ సంస్కృతికి వైభవం తెచ్చారని కొనియాడారు. ఈ-కామర్స్ ద్వారా నేతన్నల ఉత్పత్తులకు మార్కెటింగ్ చేస్తున్నట్లు వివరించారు.
చేనేత కార్మికులకు ఉపాధి, ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. 2018 నుంచి కొండా లక్ష్మణ బాపూజీ పేరుతో పురస్కారాలు ఇస్తున్నాం. ఈ-కామర్స్ ద్వారా నేతన్నలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించారు. కాలానికి తగ్గట్లుగా మారితేనే పోటీ ప్రపంచంలో రాణించగలం.