యూఎస్‌కు చెందిన ప్రముఖ ఐటీ, సైబర్ సెక్యూరిటీ కంపెనీ ఇవాంటి (KTR On Ivanti) హైదరాబాద్‌లో మరింత విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కేటీఆర్ (KTR On Ivanti) ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సాంకేతికత సాయంతో మనం నేరుగా ఉపకరణలతో అనుసంధానం కాగలుగుతున్నా.. వ్యక్తులు, ప్రభుత్వాలు, సంస్థలకు సైబర్ భద్రత ఈరోజుల్లో పెనుసవాల్‌గా మారిందని మంత్రి కేటీఆర్ అన్నారు.
ఇవాంటి అభివృద్ధి చేసిన సాఫ్ట్‌వేర్ ద్వారా 200 మిలియన్‌కు పైగా ఉపకరణాలు సైబర్, హాకర్స్ నుంచి రక్షించబడటం గొప్ప విషయమని కేటీఆర్ (KTR On Ivanti) కొనియాడారు. సైబర్ సెక్యూరిటీ పాలసీ కోసం ఇవాంటి వంటి సంస్థలతో కలిసి పనిచేసి దేశానికే ఆదర్శమైన పాలసీని రూపొందిస్తామని కేటీఆర్ అన్నారు. రాబోయే రెండేళ్లలో తమ కంపెనీ ఒక ఆవిష్కరణ కేంద్రం ఏర్పాటుతో పాటు, ఉద్యోగులను 2వేలకు పెంచనున్నట్లు తెలిపిన కంపెనీ ప్రకటనను కేటీఆర్ స్వాగతించారు. అదే విధంగా సైబర్ సెక్యూరిటీ అవేర్‌నెస్‌లో భాగంగా ఇవాంటి నిర్వహించే హ్యాకథాన్‌లో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం అవుతుందని కేటీఆర్ అన్నారు.