తెలంగాణ

telangana

ETV Bharat / state

'అభివృద్ధి ముఖ్యమే కానీ అది పర్యావరణానికి హాని చేసేలా ఉండకూడదు'

ktr latest news: నీరు, పారిశుద్ధ్యం, హైజీన్ వంటి అంశాలు భవిష్యత్తులో లక్షలాది ఉద్యోగాలు సృష్టించబోతున్నాయని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పురపాలకశాఖ ఆధ్వర్యంలో శానిటేషన్‌, హైజీన్‌లో నూతన ఆవిష్కరణలు ప్రోత్సహిస్తూ జరిగిన ఇంక్ ఎట్‌ వాష్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ktr
కేటీఆర్

By

Published : May 6, 2022, 7:47 PM IST

ktr latest news: అభివృద్ధి ముఖ్యమే కానీ అది పర్యావరణానికి హాని చేసేలా ఉండకూడదని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పురపాలకశాఖ ఆధ్వర్యంలో శానిటేషన్‌, హైజీన్‌లో నూతన ఆవిష్కరణలు ప్రోత్సహిస్తూ జరిగిన ఇంక్ ఎట్‌ వాష్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సదస్సులో పారిశుద్ధ్యం, మురుగుశుద్ధిపై పలువురు తమ ఆవిష్కరణలు ప్రదర్శించారు.

రాబోయే రోజుల్లో పట్టణ జనాభా భారీగా పెరగనుంది. దానికి అనుగుణంగా సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వానికి ఒక సవాల్ అని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. పట్టణాల నుంచి 45 శాతం జీఎస్డీపీ ఆదాయం వస్తుందని తెలిపారు. ఈ సంవత్సరం చివరి నాటికి 100 శాతం మురుగు నీటిని శుద్ధి చేస్తామని పేర్కొన్నారు.

మన దేశ జనాభాలో యువత ఎక్కువగా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందని కేటీఆర్ అన్నారు. పర్యావరణహిత అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. పారిశుద్ధ్య రంగంలో పెట్టుబడులు, ఆవిష్కర్తలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు.

"అభివృద్ధి ముఖ్యమే కానీ అది పర్యావరణానికి హాని చేసేలా ఉండకూడదు. నీరు, పారిశుద్ధ్యరంగంలో లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. ప్రభుత్వాలు, వ్యక్తులు, వ్యవస్థలు కలిసి పనిచేస్తే సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. ఉపాధితో పాటు చెత్త నుంచి సంపదను సృష్టించవచ్చు. తెలంగాణ ప్రభుత్వం ఆవిష్కర్తలకు మొదటి వినియోగదారుగా ఉంటుందని భరోసా ఇస్తున్నా. ప్రభుత్వంగా మేము పెట్టుబడులు పెడతాం కానీ ప్రైవేటు రంగం మాతో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాం. ఆవిష్కరణలను ప్రోత్సహిస్తూ ఆవిష్కర్తలను తీర్చిదిద్దే నగరం హైదరాబాద్. భారత్‌లో ఎక్కడివారైనా సరే తెలంగాణకు వచ్చి వారి వ్యాపారాన్ని వృద్ధిచేసుకోవాలని ఆహ్వానిస్తున్నా." -కేటీఆర్ పురపాలక శాఖ మంత్రి

అభివృద్ధి ముఖ్యమే కానీ అది పర్యావరణానికి హాని చేసేలా ఉండకూడదు

ఇదీ చదవండి:KTR on JP Nadda: 'దేశ ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టించి మాపై విమర్శలా..?'

డబ్ల్యూహెచ్ఓ నివేదికపై రాజకీయ దుమారం.. తప్పుపట్టిన 20 రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు

ABOUT THE AUTHOR

...view details