KTR Tribute to Alluri Sitaramaraju : అల్లూరి సీతారామరాజు పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని.. ఎన్ని ప్రతికూలతలు, కుట్రలు చేసినా రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడేనన్నారు. అల్లూరిని గుర్తు చేసుకోవడం ప్రతి భారత పౌరుడి విధి అని కేటీఆర్ స్పష్టం చేశారు.
వీరుడు ఎక్కడ పుట్టినా వీరుడే : కేటీఆర్ - Alluri Sitaramaraj Jayanti celebrations
KTR Tribute to Alluri : హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు పాల్గొన్నారు. అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా క్షత్రియ వర్గంలోని పేదల కోసం ప్రభుత్వం మూడెకరాల భూమి కేటాయించిందని కేటీఆర్ తెలిపారు. త్వరలోనే అక్కడ భూమి పూజ నిర్వహించాలని కోరారు.
'వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే. అల్లూరిని గుర్తు చేసుకోవడం భారత పౌరుడి విధి. ప్రభుత్వం అల్లూరి జయంతి వేడుకలు అధికారికంగా నిర్వహిస్తోంది. ఎన్ని ప్రతికూలతలు, కుట్రలు చేసినా రాష్ట్ర అభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తున్నారు.' -మంత్రి కేటీఆర్