తెలంగాణ

telangana

ETV Bharat / state

6 బిలియన్ల పెట్టుబడి, 4 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: కేటీఆర్ - telangana lates tnews

ఆటోమోటివ్ సొల్యూషన్స్​లో హైదరాబాద్ రోజురోజుకూ అభివృద్ధి చెందుతుందని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ద్వారా రాష్ట్రంలో 6 బిలియన్ డాలర్ల పెట్టుబడి, 4 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ మొబిలిటీ వీక్‌లో భాగంగా హెచ్​ఐసీసీలో జరిగిన ఈవీ సదస్సులో మంత్రి పాల్గొన్నారు.

KTR participated in E Mobility Week
KTR participated in E Mobility Week

By

Published : Feb 6, 2023, 6:47 PM IST

తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ద్వారా.. 6 బిలియన్ డాలర్ల పెట్టుబడి, 4 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గిస్తూ.. సుస్థిర ఎలక్ట్రిక్ వాహనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ హెచ్​ఐసీసీలో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన ఈ మొబిలిటీ వీక్‌లో భాగంగా రెండో రోజు జరిగిన ఈవీ సదస్సులో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. సదస్సులో భాగంగా బాష్‌ వంటి పలు దిగ్గజ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా ఇండియాలోనే తొలిసారి ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్​లో నిర్వహిస్తున్నామని కేటీఆర్​ పేర్కొన్నారు. సోలార్ ఎనర్జీలో దేశంలో తెలంగాణ రెండో స్థానంలో ఉన్నామన్న కేటీఆర్‌.. ఎలక్ట్రిక్ వెహికిల్స్​ను ప్రోత్సహిస్తున్నామని స్పష్టం చేశారు. ఆటోమోటివ్ సొల్యూషన్స్​లో హైదరాబాద్ రోజురోజుకూ అభివృద్ధి చెందుతుందని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.

ఈ క్రమంలోనే ఈవీ-ఈఎస్‌ఎస్‌-2020 పథకంపైనా దృష్టి సారించామని కేటీఆర్​ పేర్కొన్నారు. దీని ద్వారా విద్యుత్‌ వాహనాలు, బ్యాటరీ తయారీ కోసం పెట్టుబడులు సులభతరం చేసి.. రాష్ట్రంలో ఈవీల సంఖ్య పెరిగే విధంగా చేయడం.. ఛార్జింగ్‌ స్టేషన్‌లను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. దేశంలో మొట్టమొదటి న్యూ మొబిలిటీ ఫోకస్‌ క్లస్టర్‌.. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ అని ప్రకటిస్తున్నామన్న ఆయన.. దీని ద్వారా ఈ రంగంలో తెలంగాణను తయారీ, పరిశోధనలకు సంబంధించి మంచి మౌలిక వసతులతో గమ్యస్థానంగా మార్చనున్నామని స్పష్టం చేశారు.

''త్వరలోనే మరో 4 మొబిలిటీ క్లస్టర్లు ప్రకటిస్తాం. మొబిలిటీ వ్యాలీ ద్వారా 6 బిలియన్ల పెట్టుబడి, 4 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం. ఈ మొబిలిటీ వీక్‌లో భాగంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. హైదరాబాద్‌లో తొలిసారి ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తున్నాం. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహిస్తూ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం.'' - కేటీఆర్​, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి

ఐటీ శాఖకు రూ.4 వేల కోట్లు..: 2022-23 సంవత్సరానికి సంబంధించి బడ్జెట్​లో పరిశ్రమల శాఖకు రూ.4037 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. తెలంగాణలో శాంతిభద్రతల నిర్వహణ సమర్థవంతంగా ఉండబట్టే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతోందని బడ్జెట్​ సందర్భంగా మంత్రి హరీశ్​రావు వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయంటే రాష్ట్రంలో మెరుగైన శాంతిభద్రతల నిర్వహణ ఒక కారణమన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన దగ్గర్నుంచీ ఎనిమిదిన్నరేండ్లలో ఐటీ వార్షిక ఎగుమతుల విలువ భారీగా పెరిగిందని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. ఐటీ ఉద్యోగ నియామకాల్లో కూడా వృద్ధి సాధించామన్నారు. ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు సైతం విస్తరిస్తున్నామన్నారు.

6 బిలియన్ల పెట్టుబడి, 4 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యం: కేటీఆర్

ఇవీ చూడండి..

వాటిపై దృష్టిపెడితే.. ఇండియానే నంబర్ వన్: కేటీఆర్

హైదరాబాద్​లో మరో గ్లోబల్​ క్యాపబిలిటీ కేంద్రం ఏర్పాటు.. కేటీఆర్​ హర్షం.!

ABOUT THE AUTHOR

...view details