జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీల మధ్య మాటాల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రులు హైదరాబాద్‌కు రానున్నారు. దీనిపై స్పందించిన కేటీఆర్... తనదైన శైలిలో చమక్కులు వదిలారు.
హైదరాబాద్‌కు వస్తున్న కేంద్రమంత్రులపై కేటీఆర్ చమక్కులు - KTR on Union Ministers
మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో కేంద్రమంత్రులపై ట్విట్టర్లో చమక్కులు వదిలారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా వరదలాగా దిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కేంద్రమంత్రులకు స్వాగమంటూ ఎద్దేవా చేశారు.
![హైదరాబాద్‌కు వస్తున్న కేంద్రమంత్రులపై కేటీఆర్ చమక్కులు Minister KTR on Union Ministers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9662866-181-9662866-1606308024946.jpg)
హైదరాబాద్‌కు వస్తున్న కేంద్రమంత్రులపై కేటీఆర్ చమక్కులు
వరదలాగా దిల్లీ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కేంద్రమంత్రులకు స్వాగతమని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో ఎద్దేవా చేశారు. ఉత్త చేతులతో రాకుండా వరద సాయంగా రూ.1,350 కోట్లు తీసుకొస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. అకాల వర్షాలతో, వరదలతో తల్లడిల్లుతున్నప్పుడు కేంద్ర మంత్రులు వస్తే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.