కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలను వ్యతిరేకిస్తున్నామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం ప్రకటించారు. ఈ నెల 8న తెరాస కార్యకర్తలు, రైతు సమితి సభ్యులు ఆందోళనల్లో పాల్గొనాలని సూచించారు.
ఈనెల 8న వ్యాపార, వాణిజ్య సముదాయాలు కూడా బంద్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆరోజు దుకాణాదారులు 2 గంటలు ఆలస్యంగా దుకాణాలు తెరవాలని కోరుతున్నాం. రవాణా సంస్థలు, వాహనాలు కూడా భారత్ బంద్‌లో పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తున్నా.
--- మంత్రి కేటీఆర్
ఈనెల 8న మధ్యాహ్నం 12 గంటల వరకు అన్ని కార్యకలాపాలు స్తంభింపచేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. రైతు శ్రేయస్సు కోసం అన్ని వర్గాల వారు సంఘీభావం తెలపాలని అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ కూడా మధ్యాహ్నం తర్వాతే బస్సులు నడపాలని విజ్ఞప్తి చేశారు.
దిల్లీలో రైతన్నలు ఎముకలు కొరికే చలిలో అవస్థలు పడుతున్న దృశ్యాల్ని చూస్తున్నాం. వారికి మా పార్టీ తరఫున సెల్యూట్ చేస్తున్నా. ఎల్లుండి వారు ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు పార్టీ తరఫున నిర్ణయం తీసుకున్నాం. ప్రజాప్రతినిధులు, అన్ని వర్గాల ప్రజలు రైతులకు సంఘీభావం తెలపాలని కోరుతున్నా.
--- మంత్రి కేటీఆర్
మేం వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకం : కేటీఆర్ ఇదీ చూడండి:భారత్ బంద్‌కు కేసీఆర్ సంపూర్ణ మద్దతు