దేశంలో రైతుల ఆత్మహత్యలు అత్యల్పంగా నమోదవుతున్న రాష్ట్రం తెలంగాణ అని.... కేంద్ర ప్రభుత్వమే చెబుతోందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పాత 10 జిల్లాల్లో తెలంగాణ స్టేడ్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్‌లను ఏర్పాటు చేసి... రైతులు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని.. కేటీఆర్ వివరించారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు సంబంధించి.. శాసన మండలిలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
రైతు ఆత్మహత్యలు తెలంగాణలోనే తక్కువని పార్లమెంట్లో కేంద్రమే చెప్పింది: కేటీఆర్ - తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తక్కువ
12:38 October 01
TS COUNCIL: రైతుల ఆత్మహత్యలు తెలంగాణలోనే తక్కువని కేంద్రమే చెప్పిది: కేటీఆర్
వ్యవసాయ రంగంలో దేశమే ఆశ్చర్యపోయే విధంగా... స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్లలో ఏ ప్రధాన మంత్రి, ఏ ముఖ్యమంత్రి ఆలోచించనంతగా రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల కోసం అనేక సంక్షమ పథకాలు తీసుకొచ్చారు. రైతుబంధు, రైతు బీమా, రైతు వేదికల నిర్మాణం సహా పలు ఇంజినీరింగ్ అద్భుతాలతో వ్యవసాయరంగంలో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. రైతుల ఆత్మహత్యలు అత్యల్పంగా తెలంగాణలోనే ఉన్నాయని పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వమే చెబుతుంది. వ్యవసాయ ఉత్పత్తులు అత్యధికంగా తెలంగాణలోనే ఉన్నాయని ఫుడ్‌కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఆహార ఉత్పత్తులు, వరి విషయంలో తెలంగాణ పంజాబ్‌ను దాటిపోయి అగ్రభాగాన ఉందని కేంద్రమే తెలిపింది. భారత దేశంలో గత ఏడేళ్లలో రైతుకు అత్యధికంగా ఆదాయం(6.59శాతం) పెరిగింది తెలంగాణలో మాత్రమేనని నివేదికలు వెల్లడిస్తున్నాయి. -కేటీఆర్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి.
మున్సిపల్ శాఖ నిర్లక్ష్యం వల్లే మణికొండ ఘటన: కేటీఆర్
మున్సిపల్‌శాఖ నిర్లక్ష్యం వల్లనే మణికొండలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందాడని మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. రజనీకాంత్ మృతికి బాధ్యత వహిస్తామని.. మండలి సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అడిగి ప్రశ్నకు.. సమాధానంగా మంత్రి వివరణ ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇప్పటికే రజనీకాంత్ కుటుంబానికి రూ.5లక్షలు అందించామని... మరో రూ.5లక్షలు అందిస్తామని ప్రకటించారు. ఘటనకు సంబంధించి ఇద్దరు అసిస్టెంట్ ఇంజినీర్లను సస్పెండ్ చేశామని కేటీఆర్ తెలిపారు. మణికొండ ఘటనపై ఉన్నతస్థాయి విచారణ చేపడుతున్నామన్నారు. కొత్తగా వరద కాలువలు నిర్మాణం చేపడుతున్నామని.. ఏడేళ్లలో అక్కడక్కడా నాలాలపై ఆక్రమణలు జరిగాయని కేటీఆర్ వెల్లడించారు. అకాల వర్షాలకు న్యూయార్క్ లాంటి నగరాలే ఇబ్బందులకు గురవుతున్నాయన్న మంత్రి కేటీఆర్ అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నాలాల విస్తరణకు సంబంధించి.. ఎస్ఎన్డీపీ ప్రాజెక్టుతో ముందుకు వెళ్తున్నామన్నారు.