తెలంగాణ

telangana

ETV Bharat / state

KTR Speech in Assembly: మున్సిపల్‌ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం: కేటీఆర్

మున్సిపల్‌ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినట్లు అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ( KTR in Assembly Sessions 2021) స్పష్టం చేశారు. ఏకకాలంలో సమతుల్య అభివృద్ధికి కృషిచేశామని వెల్లడించారు. పట్టణాల్లో పచ్చదనం పెరిగేలా 10 శాతం గ్రీన్‌బడ్జెట్‌ (green budget) కేటాయించినట్లు తెలిపారు.

minister-ktr-municipal-sector-in-assembly-sessions-2021
KTR Speech in Assembly: మున్సిపల్‌ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం: కేటీఆర్

By

Published : Oct 7, 2021, 3:31 PM IST

Updated : Oct 7, 2021, 4:00 PM IST

మున్సిపల్‌ రంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాం: కేటీఆర్

మున్సిపల్‌ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని ఐటీ, పురపాలకల శాఖ మంత్రి కేటీ రామారావు అసెంబ్లీ సమావేశాల్లో( KTR in Assembly Sessions 2021) పేర్కొన్నారు. పౌరుల భాగస్వామ్యం ఉండేలా చట్టాలు తెచ్చామని వెల్లడించారు. పట్టణాల్లో పచ్చదనం పెరిగేలా 10 శాతం గ్రీన్‌బడ్జెట్‌ (green budget) కేటాయించినట్లు స్పష్టం చేశారు. ఏకకాలంలో సమతుల్యమైన అభివృద్ధికి ప్రభుత్వం (telangana government) కృషి చేస్తుందని తెలిపారు. పట్టణాల్లో చెరువులను కూడా అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రూ.850 కోట్లతో నాలాలు అభివృద్ధి చేస్తున్నామన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచి సకాలంలో చెల్లిస్తున్నామని వివరించారు. మెట్రో నష్టాలపై కమిటీ వేశాం.. నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.

రూ.5,378 కోట్లతో ఇంటింటికీ తాగునీరు ( free water) అందిస్తున్నామని స్పష్టం చేశారు. రూ.1,200 కోట్లతో హైదరాబాద్‌ శివారు ప్రాంతాల అభివృద్ధి చేపట్టినట్లు వివరించారు. పెరుగుతున్న హైదరాబాద్‌ అవసరాలకు అనుగుణంగా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. పేదవారికి రుపాయికే నల్లా కనెక్షన్‌ ఇస్తున్నామని మరోసారి గుర్తు చేశారు. భవిష్యత్తులో 24 గంటల పాటు నీళ్లిచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఉద్ఘాటించారు.10 వేలకు పైగా టాయిలెట్లు (toilets) కట్టించామని తెలిపారు.

మున్సిపల్‌ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. పౌరుల భాగస్వామ్యం ఉండేలా చట్టాలు తెచ్చాం. పట్టణాల్లో పచ్చదనం పెరిగేలా 10 శాతం గ్రీన్‌బడ్జెట్‌ కేటాయించాం. ఏకకాలంలో సమతుల్యమైన అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది. పట్టణాల్లో చెరువులను కూడా అభివృద్ధి చేస్తున్నాం. రూ.850 కోట్లతో నాలాలు అభివృద్ధి చేస్తున్నాం. పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచి సకాలంలో చెల్లిస్తున్నాం. మెట్రో నష్టాలపై కమిటీ వేశాం.. నివేదిక వచ్చాక నిర్ణయం. రూ.5,378 కోట్లతో ఇంటింటికీ తాగునీరు అందిస్తున్నాం. రూ.1,200 కోట్లతో హైదరాబాద్‌ శివారు ప్రాంతాల అభివృద్ధి చేపట్టాం. పెరుగుతున్న హైదరాబాద్‌ అవసరాలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నాం. పేదవారికి రుపాయికే నల్లా కనెక్షన్‌ ఇస్తున్నాం. . 10 వేలకు పైగా టాయిలెట్లు కట్టించాం

- కేటీ రామారావు , పురపాలక శాఖ మంత్రి

ఇదీ చూడండి: KTR in Assembly: త్వరలోనే ఆ ప్రాంతాలకు నీటి సరఫరా: కేటీఆర్‌

Last Updated : Oct 7, 2021, 4:00 PM IST

ABOUT THE AUTHOR

...view details