వరద విలయానికి అతలాకుతలమైన హైదరాబాద్ గగన్‌పహాడ్‌లో బాధితుల్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఓదార్చారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో కలిసి వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించారు. వరదల్లో కుటుంబసభ్యుల్ని కోల్పోయిన బాధితుల్ని పరామర్శించారు. ప్రభుత్వం తరఫున వారికి ఐదు లక్షల రూపాయల సాయానికి సంబంధించి చెక్కు అందించారు.
వరద బాధితులకు మంత్రి కేటీఆర్ పరామర్శ - Minister KTR Tour
గగన్‌పహాడ్‌లో మంత్రి కేటీఆర్, ఎంపీ ఓవైసీ పర్యటించారు. మృతుల కుటుంబసభ్యులను కేటీఆర్ పరామర్శించారు.
గగన్‌పహాడ్‌లో మంత్రి కేటీఆర్ పర్యటన.. వరద బాధితులకు పరామర్శ
గగన్‌పహాడ్‌లో బుధవారం ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతుకాగా... వారిలో ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
Last Updated : Oct 17, 2020, 1:18 PM IST