ktr on Swachh survekshan awards : స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మరిన్ని అవార్డులే లక్ష్యంగా కృషి చేయాలని అధికారులకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సూచించనున్నారు. ఈ విషయమై మంత్రి కేటీఆర్ ఇవాళ రాష్ట్రంలోని మేయర్లు, ఛైర్పర్సన్లతో వర్చువల్ పద్ధతిలో ఇవాళ సమావేశం కానున్నారు. ఈ ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్‌లో రాష్ట్రానికి 12 అవార్డులు దక్కాయి. వచ్చే ఏడాది ఈ సంఖ్యను కనీసం రెట్టింపు చేయాలన్న ధ్యేయంతో మంత్రి కేటీఆర్ ఉన్నారు. ఆ దిశగా పురపాలక శాఖ ఇప్పటికే మున్సిపల్ కమిషనర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించింది. తాజాగా మేయర్లు, ఛైర్‌పర్సన్లకు కూడా అవగాహన కల్పించనున్నారు.
ktr on Swachh survekshan awards : స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మరిన్ని అవార్డులే లక్ష్యంగా.... - మున్సిపల్ అధికారులతో మంత్రి కేటీఆర్ భేటీ
ktr on Swachh survekshan awards : స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మరిన్ని అవార్డులే లక్ష్యంగా నగరపాలికల మేయర్లు, మున్సిపల్ ఛైర్‌పర్సన్లు, కమిషనర్లకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశం చేయనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని మేయర్లు, ఛైర్పర్సన్లతో వర్చువల్ పద్ధతిలో ఇవాళ సమావేశం కానున్నారు.
Swachh survekshan awards
రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న పరిశుభ్రమైన పట్టణాల లక్ష్యం దిశగా కార్యాచరణ అమలు చేస్తే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ఫలితాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఆ దిశగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయడం లాంటి వాటిపై ఇవాళ్టి సమావేశంలో చర్చించి దిశానిర్దేశం చేస్తారు.
ఇదీ చూడండి:రెండో రోజు రైతుబంధు సాయం.. 17 లక్షలకు పైగా రైతులకు లబ్ధి